చక్కటి చెలిమి ;- ఎడ్ల లక్ష్మి
కుక్క కోతి పిల్లిని చూసారా 
ఒక్క దగ్గరకొచ్చాయి 
ఓర్పు తోడ ఉన్నాయి 
చక్కగా చెలిమి చేసాయి

శత్రుత్వం మరిచాయి 
మిత్రుత్వంతో మెదిలాయి 
మాతృ ప్రేమ పంచాయి 
పితృ మనసును చూపాయి 

సోదర భావం చూపాయి 
మధురమైన మనసుతో
బెదురును అవ్వి మరిచాయి
కుదురుగా అవి నిలిచాయి 

పిల్లల్లారా చూడండి 
మీలో వైర్యం మానండి 
అందరూ కలిసి ఉండండి 
ఐక్యతనే మీరు చాటండి 


కామెంట్‌లు