నమ్మకం ; - తమిళంలో మనుష్యపుత్రన్; - అనుసృజన - జగదీశ్ యామిజాల
"సరిగ్గా ఉన్నాయేమో
లెక్కపెట్టుకోండి" అన్నారు 
డబ్బులిచ్చిన వ్యక్తి

"ఉంటుందండి" అంటూ
ఒకింత సిగ్గుపడి డబ్బునందుకున్నాను

ఇప్పటివరకూ
ఒక్కసారికూడా 
ఎవరి దగ్గరా 
రూపాయి నోట్లను
లెక్కించి తీసుకున్నట్లు
జ్ఞాపకం లేదు

ఇచ్చి పుచ్చుకోవడాలలో
లెక్కించడమనేది
అనుమతించబడిన 
విషయమే అయినా
వీటిలో ఏదో ఒకటి
"నమ్మకానికి"
ఓ మెట్టు తక్కువేనని
అనిపిస్తోంది

మనిషికి
సాటి మనిషి మీద 
ఉన్న అన్ని అపనమ్మకాలూ
నన్ను సిగ్గుపరుస్తున్నాయి

అందులోనూ
ముఖ్యంగా 
డబ్బు కల్పించే అమర్యాదలాంటిదీ
అపనమ్మకంలాంటిదీ
మరేవీ కల్పించ లేవు

దేనినైనా సరిచూసుకునేలా
దేనినైనా పరిశోధించేలా
ఈ లోకం లేకుండా ఉండి ఉంటే 
ఎంతో ప్రశాంతంగా ఉంటుంది
------------------


కామెంట్‌లు