అత్తగారు కోడలి ప్రవర్తనను అనుక్షణం పరిశీలిస్తూ ఆమె చేసే ప్రతి పనిని మనసులోనే అభినందించుకుంటూ ఇంటి బాధ్యత మొత్తం తనకు అప్పగించిన తనకు ఎలాంటి బాధ ఉండదని బాధ్యత తెలిసిన కోడలు రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని మనసులో ఎంత ఆనందిస్తుందో ఆ ఆనంద సమయంలో ఓ రోజు కోడలిని పిలిచి నాకు ఆడపిల్లలేని కొరత తీర్చావమ్మా ఈరోజు నుంచి ఇంటి బాధ్యతను నీవే తీసుకోవాలి అని తాళం చెవులు ఇచ్చి ఆర్థికంగా కూడా ప్రతి పైసా తన చేతుల గుండానే ఖర్చు చేసే పనిని అప్పగించినప్పుడు దానిని హక్కుల కాక బాధ్యతగా స్వీకరిస్తుంది ఆ కోడలు తన ఊహలకు విధానాలకు ఎంత వ్యత్యాసం ఉందో అర్థం చేసుకుంటుంది.ఆ క్షణం నుంచి ఆ ఇంటి పరిస్థితి మారిపోతుంది అంతకుముందు పెత్తనం చెలాయించిన వారందరూ కూడా బానిసలైపోయారు తమకు ఏ అవసరం వచ్చినా ఆమె వద్దకు వెళ్లి ఆ అవసరానికి ఎంత ఖర్చవుతుందో వివరాలు చెప్పి ఆ తరువాత డబ్బులు తీసుకోవడం ఆమెకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అలాంటి సమయంలో తన తల్లిదండ్రులు ఈ ఇంటికి వచ్చినప్పుడు ఆ కుటుంబ పరిస్థితులను అవగాహన చేసుకున్నప్పుడు వారి ఆనందానికి అవధులు ఉంటాయా అత్తవారింట్లో కూడా నా బిడ్డ ఎంతో హాయిగా తమ ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటుందని తమ జీవిత ఆశయము నెరవేరినట్టుగా ఆనందించకుండా ఉంటారా ప్రతి కుటుంబం అలా ఉండాలని నా ఆకాంక్ష. అరిటి ఆకు మరో మనస్తత్వం ఈ మనుషులు భోజనం చేయడానికి నన్ను తప్పు మరి ఎవరిని వాడుకోరు నేను మీకంటే చాలా గొప్ప అని మిగిలిన ఆకుల ముందు ఎంతో గర్వంగా చెప్పుకుంటుంది దీనికి దేవుడు ఆలోచించాడు అరటి ఆకు తిన్న తరువాత దాని బ్రతుకు చెత్త కుప్పులో పడేట్లుగా చేశారు తమలపాకు గర్వం మరోరకం నేను శుభకార్యాలకే కాదు నన్ను తాంబూలంగా వేసుకుంటే నోరు ఎర్రగా పoడుతుంది నాకు సాటి ఎవరూ లేరు అని విర్రవీగుతుంది అప్పుడు దేవుడు దాని పొగరు అనచటo ఎలా అని ఆలోచించి ఒక ఉపాయం ఆలోచించాడు తమలపాకులు నమిలి రసమయిన తర్వాత బయటికి వూసేలా చేశాడు అలా దాని గర్వాన్ని అణచటానికి మార్గాన్ని వెతికాడు.
==========================
సమన్వయం ; డా. నీలం స్వాతి
==========================
సమన్వయం ; డా. నీలం స్వాతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి