“మా అమ్మ పొరుగువారిని ఉప్పు అడగడం వింటుండే వాడిని....నిజానికి మా అమ్మ అలా అడగవలసిన అవసరం లేదు. ఎందుకంటే మా ఇంట తగినంత ఉప్పు ఉండేది. దాంతో ఉండబట్ట లేక ఒకరోజు మా అమ్మని అడిగాను...ఇంట్లో ఉప్పుండగా పొరుగు వాళ్ళని ఎందుకడుగుతావమ్మా అని. అప్పుడు అమ్మ ఇలా చెప్పింది...అది నన్ను ఆలోచింపచేసింది" అన్నాడు అతను.
"నిజమే...నువ్వడిగిందాంట్లో తప్పేమీ లేదు. కానీ ఎందుకడిగే దానంటే, మా పొరుగువారి వద్ద డబ్బులు ఉండేవి కావు. కూలీనాలీ చేసుకుని వచ్చే అరకొర సంపాదనతో బతుకుతున్న వారు. అందుకనివారు తరచు మనల్ని ఏదో ఒకటి అడుగుతుంటారు. అలా అడిగేటప్పుడల్లా వాళ్ళు ఎంతో మొహమాటంతో ఆడిగేవారు. కొందరేమో ఇబ్బందిపడేవారు. బిడియపడేవారు. వారిలోని సున్నితత్వాన్ని పోగొట్టడం కోసం ఎదురు నేనూ చిన్నచిన్నవి తక్కువ మోతాదులో అడుగుతాను. అప్పుడు వారు ఇస్తూ పొందే ఆనందం ఆ కళ్ళల్లో చూస్తున్నాను. మనకూ ఏదో ఒకటి అవసరమని వారనుకుంటారు. ఇద్దరి మధ్య ఇచ్చిపుచ్చుకోవడమనేది ఉంటే బిడియమూ ఉండదు. ఇబ్బందీ ఉండదు. వాళ్ళు అడగటానికి ఆలోచించక్కర్లేదు" అని అమ్మ చెప్పింది.
అమ్మ చెప్పిన మాటల్లోంచి నేను నేర్చుకున్న వాటిలో ఇదొకటి...చెప్పలేని అనేక విలువలతో కూడిన సహానుభూతి.... వినయం... చిన్నప్పటి నుంచే చేతనయ్యే రితో సాయం చేసే గుణాన్ని కల్పించడం!
ఇది ఓ ఇంగ్లీష్ రచయిత రాసుకున్న విషయం. బాగుందనిపించింందీ నిజం!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి