నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారు శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో తెనాలి రామకృష్ణుడు లాగా వీరు చెప్పాలంటే అప్పటికప్పుడు చెప్పగలిగిన మేధ అవి సంస్కృత ఆంధ్ర భాషలకు సంబంధించినది ఆయన ప్రక్కవ్యాజ్యం వాయించేటప్పుడు తెలిసో తెలియకో గాయకుడు గాని గాయని కానీ అపశృతి వేస్తే ఈయన కూడా అలాగే వాఇంచేవారు మీరు ఎందుకని తప్పుగా ఇస్తారు అంటే నేను ప్రక్కవ్యాజ్య గాడిని ఆయన వాయించినది వాయించకపోతే నేను ఆయన్ని అవమానపరిచినట్టుగా ఉంటుంది కనుక నేను అలాగే వాయిస్తాను అనేవాడు సంగీత సారస్వతాలలో వేదాన్ని అప్పట్లో ఉమ్మడి కుటుంబం గా ఉండేది ఆల్ ఇండియా రేడియో మాకు మీటింగ్ అవ్వగానే 10 గంటల 30 నిమిషాలకు ఒక రోజు ఫలహారాలు గాని జగన్నాథ ఆచార్యుడు గారు కానీ చక్కెర పొంగలి పంపిస్తూ ఉండేవారు మరలా శ్రీనివాస అన్నగారు ఎప్పుడు తీపి పదార్థాలే పంపేవారు.ఎక్కడో మారుమూల ఏలూరు దగ్గరలో ఉన్న సోమవరప్పాడు అన్న కుగ్రామంలో జన్మించి విజయవాడ వచ్చి రామకృష్ణయ్య పంతులు గారి దగ్గర శిష్యునిగా చేరి వయోలిన్ విద్యలో ఉన్న రహస్యాలను అవగాహన చేసుకున్నారు సరిగమపదని అన్న సప్త స్వరాలతో త్యాగరాజస్వామి వారి 24 వేల కీర్తనలను మిగిలిన వారి కీర్తనలను అలవోకగా చెప్పగలిగిన సామర్ధ్యాన్ని పెంచుకున్నారు వీరి తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కానీ అన్నవరపు రామస్వామి అన్న సార్ధక నామాన్ని వీరికి అందజేశారు అన్నవరం అన్న ఇచ్చే వారు అని అర్థంలో వాడవచ్చు అన్నవరం లోని స్వామి సత్యనారాయణ స్వామి సత్య నార ఆయన శబ్దాలతో కూడిన సత్యనారాయణ శబ్దం సత్ అంటే ఏదైతే శాశ్వతంగా ఉంటుందో అది నార అంటే నీరు ఆయన అంటే తిరగడం శరీరంలో నీరు ఆపాదమస్తకం ప్రవహిస్తోంది వీరు దేనినైతే శాశ్వత విద్యనుకున్నారో ఆ విద్యను వారి చుట్టూ తిరిగి దానిని తన చుట్టూ తిప్పుతూ ఉన్నాడు కనుక వయోలిన్ పై కమాన్ పెట్టగానే సుస్వరాలతో కూడిన పదాలు మనకు వినిపిస్తాయి అన్నవరపు రామస్వామి గారు అనగానే అజాతశత్రువు మన ముందు కనిపిస్తాడు ఒకరి గురించి చెడుగా ఆలోచించడం కానీ చెప్పడం కానీ ఎవరైనా చెప్పినా వినడం కానీ ఆయన జీవితంలో జరగని పని ఎవరి ఇంట్లో ఏది ప్రత్యేకంగా ఉంటుందో దానిని ఆ ఇల్లాలు పంపించేది ఏ ఒక్కరు ఎవరిని గురించి ఒక్క చెడు మాట కూడా అని ఎరుగరు అందుకే ఆ కాలాన్ని గోల్డెన్ పీరియడ్ అని అనుకునే వాళ్ళం.
==================================
సమన్వయం ; డా. నీలం స్వాతి
==================================
సమన్వయం ; డా. నీలం స్వాతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి