ఊషన్నపల్లి పాఠశాలలో రాత పుస్తకాలు పంపిణీ

 ఊషన్నపల్లి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఊషన్నపల్లి గ్రామానికి చెందిన ముస్కు సతీష్ (ఫర్టిలైజర్) పాఠశాల పిల్లలకు 50 రాత పుస్తకాలు, పెన్సిల్లు, రబ్బర్లు, చాక్మార్లు, బలపాల పుడలు అందజేశారు. అలాగే ప్రముఖ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు పులి ఇంద్రకరణ్ రెడ్డి తన తల్లి పులి నాగమణి జ్ఞాపకార్థం పాఠశాల పిల్లలకు 120 రాత పుస్తకాలు, క్రెయాన్స్ పాకెట్లు (రంగుల పెన్సిల్లు), ఇతర విద్యాసామగ్రిని అందజేసి, వారి ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా దాతలు పులి ఇంద్రకరణ్ రెడ్డి, ముస్కు సతీష్ లు మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలు బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని, తమ వంతుగా ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు విద్యాసామగ్రిని అందజేసినట్లు వారు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, వాటిని బలోపేతం చేయాలని వారు కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ పాఠశాల పిల్లల ప్రయోజనం కోసం వేలాది రూపాయల విలువైన విద్యా సామాగ్రిని అందజేసిన దాతలు ముస్కు సతీష్, పులి ఇంద్రకరణ్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. వారి సేవలను కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పిల్లలకు సమయస్ఫూర్తి, తార్కిక ఆలోచన, పోటీ తత్వాన్ని, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం పెంపొందుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పిల్లలు మాత్రమే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారన్నారు. దేశ భవిష్యత్తు ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే చేర్పించాలని ఈర్ల సమ్మయ్య గ్రామంలోని తల్లిదండ్రులను  కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఈర్ల సమ్మయ్య, అమృత సురేష్ కుమార్, దాతలు పులి ఇంద్రకరణ్ రెడ్డి, ముస్కు సతీష్, నాయకులు తులా మనోహర్ రావు, రానవేన శ్రీనివాస్, అల్లంల దేవేందర్, కారుపాకల రమేష్, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు