పుణ్య ఫలము...! కోరాడ నరసింహా రావు!
 దేశ రక్షణలో... కార్గిల్ యుద్ద వీరుల ప్రాణ త్యాగాలకు పాతి కేళ్లు...! 
    దేశ ప్రజల క్షేమం కోసం.... 
 తమ ప్రాణాలను పనంపెట్టే... 
  త్యాగ ధనులు వారు...!! 
మనం హాయిగా తిని... 
   నిశ్చింతగా నిద్ర పోయే సమయములో... 
   తిండి, నిద్రలు కరువై... 
  ఎముకలు కొరికే చలిలో... 
  వారిని ఆందోళనకు గురి చేసిన  రాత్రులు ఎన్నో...! 
కన్నవారిని, ఉన్న ఊరిని , కట్టుకున్న భార్యను , కన్న బిడ్డలను ... సుఖాన్ని, సంతోషాన్ని,ఆనందాలను...
అన్నీ వదలుకుని.... 
  అది మృత్యువని తెలిసినా
 ఎదురెల్లగల ధైర్యం, సైనికునికి గాక, వేరెవరి కుంది...!? 
 ఓ వీర సైనికు లారా మీ ధైర్య, సాహసములు ఎన లేనివి...!! 
   
అటు పాకిస్తాన్...ఇటుచైనా... 
  అదనుకోసం ఎదురుచూసే
  గుంట నక్కలకు తగిన బుద్ది చెప్పగల మీ చతురతకు... 
  యే బిరుదులు, ఎట్టి సన్మాన , సత్కారములు సరితూగగలవు!? 
  మీరు దూరమైన లోటును , మీ కుటుంబానికి కలుగ నివ్వక , రుణము తీర్చుకో గలగటంతప్ప...!! 
 మీ ఈ  త్యాగఫలాలను అనుభవించ , మరల ఈపుణ్య  భూమిలోతప్పక మీరు జన్మిం చెదరు..! 
  ఇది కర్మ భూమి..! ధర్మభూమి
 ఇక్కడ మనము చేసిన పాప, పుణ్య కర్మలకు, మరియొక జన్మ మెత్తి అనుభవించియే  తీర వలెను...! 
   మీ పుణ్య ఫలము మీకు
    ప్రాప్తించియే తీరును...!! 
       *******

కామెంట్‌లు