తాను తీసుకున్న నిర్ణయం మంచిదా చెడ్డదా అనే సందేహాన్ని నివృత్తి చేసేది నిర్ధారిత మనస్సాక్షి ఆ తీసుకున్న నిర్ణయానికి తిరుగులేదు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను కదా ఇది మంచిదా చెడ్డదా అని ఎప్పుడైతే సందేహిస్తూ ఆలోచనలో పడ్డాడో దానిని అనుమానకరమైన సత్యం దానిని నివృత్తి చేసేది నిర్ధారిత మనస్సాక్షి మాత్రమే తీసుకునే నిర్ణయాల విషయంలో చాలా సూక్ష్మమైన అంశాలను జాగ్రత్తగా గమనించి ఎరుకపరిచేది సున్నిత మనస్సాక్షి మనస్సాక్షి చెప్పే దాన్ని విని సరైన నిర్ణయాలు తీసుకునేవారు జీవితంలో నిబద్ధత కలవారు అవుతారు మన గురించి మనకు తెలియచేయడం మన లోపలి ఆలోచనలను కావాలని నిజాయితీగా ఉండేట్లు నియంత్రించడం మనస్సాక్షి చేసే పని అందుకే నీ ఆత్మ చెప్పినట్టు చేయడమే శ్రేయస్కరం ఆత్మ బుద్ధిహీ సుఖం చైవ అని సూక్తి.నీవు తీసుకున్న నిర్ణయానికి నీవే బాధ్యత వహిస్తాం ఎదుటివారు చెప్పిన నిర్ణయాలను నీవు పాటించి దానివల్ల అపజయాన్ని పొందినట్లయితే దాని బాధలు కూడా నీవే అనుభవించవలసి వస్తుంది కనుక మనస్సాక్షి అనేది మంచి చెడు అన్న రెంటిని గురించి వివరించుకుంటూ విశ్లేషించుకుంటూ నీ మనసే నీకు చెప్తుంది దీనిలో చిత్రమైన విషయం ఏమిటంటే అరిషడ్ వర్గాలుగా పేర్కొనే కామక్రోదాధు లకు తనకు కాని మార్గంలో పయనిస్తూ ఉంటారు కొంతమంది చరిత్రలో కళంకితుడు గా ముద్ర పొందుతారు గతంలో దాశరథి ఇచ్చిన వరాలను పొంది వాటితో రాముని అడవులకు పంపమని కైక కు సలహా ఇచ్చింది మందర ఆ మాటలు తలకెక్కించుకున్న కైకకు ఇలాంటి సమయంలో వాటిని అడగడం తగని పని అని మనస్సాక్షి హెచ్చరిస్తూనే ఉంది అయినా దాని నోరు నొక్కేసి చెప్పుడు మాటలకే ప్రాధాన్యతను ఇచ్చింది కైక ఫలితంగా పతి వియోగం పుత్రఛీత్కారం దాపరించాయి.
ఏకలవ్యుడికి తన పట్ల అవ్యాయమైన గురు భక్తి ఉందని ద్రోణుడికి తెలుసు అతనికి విద్యానిధి గొప్ప విలుకాడవుతాడని మనస్సాక్షి చెప్పింది విచక్షణ అనే లోపం అతడి చేత ఏ గురువు చేయకూడని పని చేయించిoది ఫలితంగా చరిత్రలో కళంకిత గురువుగా ముద్రను పొందాడు కాళిదాసు తన అభిమాన శాకుంతలం అన్న నాటకంలో ఒకచోట సందేహాలు కలిగిన సందర్భంలో సజ్జనులకు వారి మనో స్పందనలే ప్రమాణాలు అని చెప్పిస్తాడు దుశ్యంతుడితో హరిశ్చంద్రులతో ఎంతగా అబద్ధాలు పలికించాలని ప్రయత్నించినా మనస్సాక్షి సూచన మేరకు కష్టాలనే ఎదుర్కొన్నాడు తప్ప అబద్ధం ఆడలేదు ఫలితంగా సత్యానికి ప్రత్యేకత నిలిపాడు ఎవరు ఎన్ని విమర్శలు చేసినా అభ్యంతరాలు చెప్పిన ఎక్కువ మందికి మేలు జరుగుతుందని మనస్సాక్షి చెబితే వారందరి మాటలను త్రోసివేసి స్వతంత్రంగా ప్రవర్తించవచ్చునని రాజధర్మాలు చెప్తున్నాయి అందువల్లనే రాజ్య శాసనాలు కాస్త కఠినంగా కనిపిస్తాయి కానీ ప్రజల పట్ల నిరతిశయమైన అవపేక్ష కలిగిన పాలకులు మనస్సాక్షి సూచన మేరకు అలాంటి శాసనాలు చేయాలి అని చాణిక్యుడు తన నీతి శాస్త్రంలో చెప్తాడు.
===============================
సమన్వయం ; డా . నీలం స్వాతి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి