జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావుకు జాతీయ స్థాయి శ్రీ గురుభ్యోనమః ప్రశంసాపత్రం లభించింది.
గురుపౌర్ణమి సందర్భంగా హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాలం ద్వారా జాతీయ స్థాయిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న తిరుమలరావు ప్రతిభను గుర్తించి ఈ ప్రశంసాపత్రాన్ని పంపారు. అంతర్జాతీయ స్థాయిలో ఐ.ఎస్.ఓ. గుర్తింపు పొందిన
తెలుగు వెలుగు సాహిత్య జాతీయ వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, పాండిచ్చేరి యానాం లకు చెందిన రచయితలతో పాటు తిరుమలరావు పాల్గొని, వినిపించిన రచనకు అందరి ప్రశంసలు అందుకున్నారు.
జాతీయ అధ్యక్షులు పక్కి రవిశేఖర సత్యనారాయణ మూర్తి, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎస్వీ ఫౌండేషన్ ఛైర్మన్ మోటూరి నారాయణరావు, ప్రధాన సలహాదారులు కిలపర్తి దాలినాయుడు, గౌరవాధ్యక్షులు గంటా మనోహర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మీసాల చిన గౌరునాయుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పైడి నవనీత రవీందర్, మహిళా విభాగం అధ్యక్షురాలు డా.బి.హెచ్.వి.రమాదేవి బృందం తిరుమలరావును అభినందిస్తూ ఈ ప్రశంసాపత్రం పంపారు. గురువులకున్న ఔన్నత్యాన్ని చాటిచెప్పి ప్రశంసలు అందుకున్న తిరుమలరావును రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి