మహాజన అరణ్యం
జనం ధనం ఇంధనమై
కాలిపోయి కూలుతోంది
కమురు కంపు కొడుతోంది
ఎండి మోడైన ఈతచెట్టుపై
కూర్చున్న చిన్ని పిట్ట
తన గూడు కోసం వెతుకుతోంది
గుక్కెడు నీటి కోసం
మరో బంగాళాఖాతం తవ్వుకోమంటోంది
అప్పుడైనా కాస్త
తుఫాను లొస్తాయని కలగంటున్నది
ప్రతి మనిషీ పక్కవాణ్ణి
పీక్కుతినే రాబందే
"నమస్తే, సలాం అలేకుం,
నమస్కార్, హలో" లతోనే
మానవత్వపు మటన్ బిర్యానీ లతో
నిత్యం ఖుషీలు చేస్తున్నది!!
**************************************
జనం ధనం ఇంధనమై
కాలిపోయి కూలుతోంది
కమురు కంపు కొడుతోంది
ఎండి మోడైన ఈతచెట్టుపై
కూర్చున్న చిన్ని పిట్ట
తన గూడు కోసం వెతుకుతోంది
గుక్కెడు నీటి కోసం
మరో బంగాళాఖాతం తవ్వుకోమంటోంది
అప్పుడైనా కాస్త
తుఫాను లొస్తాయని కలగంటున్నది
ప్రతి మనిషీ పక్కవాణ్ణి
పీక్కుతినే రాబందే
"నమస్తే, సలాం అలేకుం,
నమస్కార్, హలో" లతోనే
మానవత్వపు మటన్ బిర్యానీ లతో
నిత్యం ఖుషీలు చేస్తున్నది!!
**************************************

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి