వింతలు విడ్డూరాలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఉన్నట్టుండి సైబీరియా ప్రాంతంలో ఓపెద్దబంతి ఆకారం లో వెలుగు కన్పడి అంతలోనే దట్టమైన అడవి అంతా నల్లగా మాడి నేలకూలాయి.30 జూన్ 1908లో టుం గుస్కా అనే నదీతీరాన ఈదుర్ఘటన జరిగింది. 32కి.మీ.పరిధిలో ఈఅగ్నిప్రమాదం జరగటం ఆకాశమంతా  మండిపోతోంది. ఉదయం 7.14 కి ఈఅగ్నిప్రమాదం జరిగింది. పెద్ద మండు తున్న బంతి ఆకాశంలో పయనిస్తూ వేడిగాలులతో వందలాది మైళ్ళు నిప్పులకొలిమిలా మారింది. సైంటిస్టులు తర్జనభర్జన పడ్డారు. ఉల్కాపాతం పిడుగు పడిన దాఖలాలు లేవు. నల్లగా మాడి మసైన చెట్లు సాక్ష్యం గా నిలిచాయి. వాతావరణంలో న్యూక్లియర్ ప్రేలుడు సంభవించింది అని కొందరి అనుమానం. ఓ చిన్న తోకచుక్క ఈవిధ్వంసానికి కారణం కావచ్చు తోకచుక్క రాతిపొరతో దుమ్ము ధూళితో ఏర్పడి భూవాతావరణంలో ప్రవేశించి నపుడు ఇలా ప్రకంపనలు కాంతి తో మంటలు చెలరేగి అడవి దగ్ధమైంది అని ఆఖరుగా తేల్చారు. ఇది చదివితే  భారతంలోని ఖాండవ దహనం గుర్తు కొస్తుంది కదూ? బాణాలతో అస్త్రా లు శస్త్రాలు సంధించారుకదా పాండవులు 🌹
కామెంట్‌లు