గురువులకు వందనం ;- ఎం. వి. ఉమాదేవి
(ఆట వెలది )
===========
సుబ్బయార్యు చదువు సూటిగా మదివెల్గి 
వీధిబడిన గొప్ప విలువబెంచె
బడిని వీడువేళ బహుమానమిచ్చిరి 
యెన్నదగిన విద్య నెదను నిలిపె!!

అమ్మ పేరుగల్గి యమితమై ప్రేమించె 
చిన్ననాడె చాల చింతదీర్చె 
వనజగారి చలువ వాసిగా సాహితీ 
పరిమళమ్ము నబ్బి పావనమ్ము!!

కోర్కె తోడ యుమను గురువుగా దీవించె 
కుసుమ గారి ప్రేమ వసుధనిండు 
ఇంగిలీషు ఘనత నింతింత దెలిపెను 
నేటితెలివి యామె నెనరువలెనె!!

గురువుచూపు బాట గుర్తింపు గలిగించె
మనసుపూల తోట! మందిరమ్ము!
చింతదీర్చి రమ్మ చిన్ననాడె యుమకు!
అంజలింతునమ్మ ననవరతము!!🌹


కామెంట్‌లు