కనకధారాస్త్రోత్రం;- కొప్పరపు తాయారు .
🌟శ్రీ శంకరాచార్య విరచిత🌟 

శ్లో!!  అంభోరుహం జన్మగృహంభవత్యాః   
వక్షఃస్థలం భర్తృగృహం మురారేః !కారుణ్యతః కల్పయ పద్మవాసే
లీల గృహమ్ మే హృదయారవిందమ్ !!

భావం: హే! పద్మాలయ దేవి! నీ పుట్టినిల్లు కమలము, మెట్టినిల్లు నీ పతి విష్ణుమూర్తి యొక్క 
వక్షఃస్థలమే. పరిశుద్ధమైన నా హృదయమునందు
స్థిర నివాస మేర్పఱచుకొని దానిని నీకేళీ గృహముగా చేసుకొనుము..
విశేషార్థము: ఇచ్చట ఆదిశంకరులు కేవలం 
"నా ఇంటికి వచ్చి యుండు"మనుట లేదు, నా హృదయమునందే నిల కడగా ఉండు"మనుచున్నారు. ఇంటికి భౌతికముగా వచ్చిన లక్ష్మి కి సహజ చాంచల్యము చే ఎప్పుడైననూ వెడలిపోవచ్చు ను. కానీ హృదయం నందు నిలుపుకున్న లక్ష్మీ మట్టుకు భక్తపరాధీనురాలు గనుక తన చాంచల్యమును వీడి భక్తునితో ఉండిపోవాలని భావము లక్ష్మీదేవిని సంపదల కొరకు ఉపాసించుట ఒక్కటే చాలదు సంపదలు సిద్ధించిన పిమ్మట కూడా ఆమె చేసిన మేలు మఱువక ఆమెను తరతరములు గా అర్ధించినప్పుడే ఆ సంపదలు కలకాలము నిలబడునని భావము. 
                 ***


కామెంట్‌లు