శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )ఎం. వి. ఉమాదేవి
941)అనాదిః -

ఆదియనునది తెలియనివాడు 
సదా భక్తుల్లో నుండు భగవానుడు 
విశ్వములో నిరంతరమైనవాడు 
నిత్య ప్రాకృతికమూర్తి యైనవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
942)భూర్భువః -

సర్వభూతాల కాధారమైనవాడు 
భూమిని నిలుపుచున్నట్టి వాడు 
భూమినేలుచు విరాజిల్లువాడు 
ధరణిపై అధికారమున్నవాడు 
శ్రీ విష్ణుసహస్ర నామాలు ఉమా!
943)లక్ష్మీః -

శ్రీ లక్ష్మి స్వరూపములోనివాడు 
సంపదలకు కారణమైనవాడు 
వస్త్రభూషణములనొసగువాడు 
శ్రీమంతుడుగా వెలుగువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
944)సువీరః -

అనేకవిధములుగా సుందరుడు 
చక్కని వీరత్వముగలవాడు 
శౌర్యవంతుడుగా యుండినవాడు 
సువీర నామధేయమున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
945)రుచిరాంగదః -

మంగళమూర్తి యైనట్టివాడు 
ఒప్పిదమైన అంగములున్నవాడు 
సూర్యకాంతివంటి మూర్తిగలవాడు 
చక్కని బాహువులతో నున్నవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
(సశేషము )

కామెంట్‌లు