అర్పించుకో;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 ఈ శరీరం
అమ్మ ఇచ్చిన వరం
శరీరం ఉంటేనేగా
నిలబడేది,మాట్లాడేది
చూసేది,వినేది, తినేది
అనుభవించేది
అందమైన భూలోకంలోని 
ప్రతి అణువూ ఆత్మీభూతంగా మారేది
పుట్టుక, చావు ఈ రెండూ కేవలం మనవే
ఈ రెంటి నడుమకాలం
అంతా ప్రపంచానిదే సుమా! 
అందుకే శరీరం కాపాడుకో 
ప్రపంచానికి ఆర్పించుకో!!
**************************************

కామెంట్‌లు