కొలాంతెగకి చెందిన మడావి కన్నీబాయి తెలంగాణ అడ్వెంచర్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్.మోదీజీనుంచి అవార్డు అందుకుంది.కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కి చెందిన ఆమె ఇంటర్ చదువుతున్నప్పుడే తండ్రి చనిపోయాడు.పారాచూట్లో శిక్షణ వాటర్ రాపెల్లింగ్ పర్వతారోహణ లో శిక్షణ పొందిన కన్నీబాయి 2022లో పంగర్చులపర్వతం ఎక్కిన తొలి ఆదివాసీ మహిళగా కీర్తి గడించింది.
ఎం.కాం.చదివిన వరాలు వై.ఎస్.ఆర్.జిల్లాకి చెందిన ఆమె తాను చేసిన ఉద్యోగం లో జీతం సరిగ్గా ఇవ్వకపోవడం తో
ఎవరూ సాహసం చేయని వృత్తి లో స్థిరపడ్డారు. శవపరీక్ష కై శవాల్ని కోయడం.తొలిరోజే శవఆగఆరంలఓమఊడఉ శవాల్ని పోస్ట్ మార్టం చేయడం భయం అన్పించినా డాక్టర్ల పర్యవేక్షణలో శిక్షణ లో ఆరితేరి దాదాపు రెండేళ్లు గా ఆపని చేస్తోంది ఓర్పుతో నేర్పుతో.గర్భంతో ఉండికూడా నెలకి 20 శవాల్ని కోయడం అబ్బురం కదూ?కర్ణాటక కి చెందిన ప్రేమాధన్ రాజ్ 8ఏళ్ల వయసులో అగ్ని ప్రమాదంలో మొహం కాలిపోయింది.12 ఆపరేషన్స్ తో ఆత్మ విశ్వాసం తో ప్లాస్టిక్ సర్జరీ లో ఎం.డీ.చేసిన ఆమె ఇప్పటికి25వేలపైగా సర్జరీలు చేసి రికార్డు సృష్టించింది.అంతర్జాతీయగుర్తింపుపొంది పద్మశ్రీ అవార్డు పొందారు 🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి