స్ఫూర్తి ప్రదాతలు 21...అచ్యుతుని రాజ్యశ్రీ
 కెప్టెన్ హర్ ప్రీత్ చాందీ బిరుదు ఏమిటో తెలుసా?పోలార్ ప్రీత్.ఇంగ్లాండ్ వాసి ఐన ఈమె బ్రిటిష్ ఆర్మీలో క్లినికల్ ట్రైనింగ్ ఆఫీసర్.  అంటార్కిటికా లో సోలో ట్రెక్కింగ్ తో గిన్నిస్ రికార్డ్ 
దక్షిణ ధృవంలో1300కి.మీ.సోలో ట్రెక్కింగ్ చేసి ఎక్స్ ప్లోరర్ ఆఫ్ ది ఇయర్ బహుమతి పొందారు. 
127 గంటలు  ఆగకుండా కథక్ డాన్స్ చేసి గిన్నిస్ బుక్ లో ఎక్కిన  సృష్టి సుధీర్  వయసు ఇప్పుడు 17 ఏళ్ళు మాత్రమే. 
19 ఏళ్ళ నందిని అగర్వాల్ సి.ఏ.పాసై ప్రపంచ రికార్డు పొందారు. ఒకే ఏడాది లో 2క్లాసులు చదివిన ప్రతిభాశాలి ఆమె.
  పోలియోతో కాళ్ళు చచ్చుబడిన సరితా అధానీఆర్చరీలో పారా ఆర్చరీమన దేశానికి తొలి బంగారు పతకం అందించారు. భర్త వదిలేసినా ఒంటరిపోరాటం చేసింది. 
41 ఏళ్ళ శీతల్ మహాజన్ 21500 అడుగుల ఎత్తులో హెలికాప్టర్ నుంచి దూకి ప్రపంచ రికార్డు పొందారు. 22వ ఏటనే ఉత్తర ధ్రువంలో స్కైడైవ్ చేసిన ఆమె 57స్కైడైవింగ్ జంప్స్ చేశారు 

కామెంట్‌లు