ఒలింపిక్స్ లో ఈజిప్ట్ కి చెందిన ఫెన్సింగ్ క్రీడాకారిణి నదా హఫీజ్ అందరి దృష్టిని ఆకర్షించింది.దానికి కారణం 7నెలల గర్భవతిగా ఓపెనింగ్ మ్యాచ్ లో విజయం సాధించిన ఘనత దక్కించుకుంది.ఈమె మెడిసిన్ పూర్తి చేసి క్లినికల్ పాథాలజిస్ట్ గా ఉంది.2ఒలింపిక్స్ ల్లో పాల్గొన్న ది ఇదివరలో.గొప్పతనంకదూ?
క్రీడాకారులకి వెన్నుదన్నుగా ఉన్న వ్యక్తి పూర్ణిమ.ఫిజియోథెరపీ చేసిన ఈమె2010లోకామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్న సిఆర్పిఎఫ్ షూటింగ్ టీం కి స్పోర్ట్స్ ఫిజియోగా ఛాన్స్ వచ్చింది.క్రీడాకారులకి జాగ్రత్తలు తీసుకోవాలి అని అవగాహన వారు త్వరగా కోలుకునే లా చూడటం ఎంతో బాధ్యతగా చేశారు.ఆటల్లో అవగాహన కోసం స్వయంగా నేర్చుకుని ఒలింపిక్స్ ఆటగాళ్లతో కల్సి పనిచేశారు.14 ఏళ్ళుగా పారా ఒలింపిక్స్ వారికి కూడా శారీరక బాధలు తొలగిస్తూ ప్రేరణ కల్గిస్తున్నారు.
శృంగారం సోనాలీ ఐ.టి.ఇంజినీర్.విదేశాల్లో ఉండి హైదరాబాద్ కి తిరిగి వచ్చి అంకాలజీ రంగంలో కాలుమోపి కాన్సర్ చికిత్స పై అందరికీ అవగాహన కలిగిస్తున్నారు.కాన్సర్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి 8 భాషల్లో దిశానిర్దేశం గావిస్తున్నారు.ప్రారంభదశలోనే కాన్సర్ ని గుర్తించేలా సయాన్ కాన్సర్ క్లినిక్ లను నడుపుతున్నారు.
డైనోసార్ ప్రిన్సెస్ అనేపేరు తో ఖ్యాతి పొందింది గుజరాత్ కి చెందిన ఆలియా సుల్తానా!1991లో ఆమె గ్రామం రైయోలీలో రాక్షసబల్లుల గుడ్లు దొరకడంతో ఆమె కి ఆసక్తి పెరిగింది.అలా తన గ్రామాన్ని డైనోసార్ మ్యూజియం గా మార్చింది.దేశవిదేశాలనుంచి దీన్ని చూడటానికి జనం వస్తారు 🌹
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి