స్ఫూర్తి ప్రదాతలు 26 అచ్యుతుని రాజ్యశ్రీ
 నేడు ప్రతివారూ ఆంగ్ల మీడియం లో చదువు తున్నారు. బట్టిపట్టి  జవాబు రాస్తారు. లెక్కలు అర్ధం కావడం కష్టం. కానీ  ఈమహిళలు ఎలా ముందడుగు వేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచారో చదవండి 
యు.పి.కి చెందిన యశోదాలోధి అమ్మా నాన్న లు కూలీలు. ఈమె హిందీ మీడియంలో చదివి  ఇంగ్లీషు మీడియం లో ఇంటర్ లో చాలా కష్టపడి 80/ మార్కులు పొందటం విశేషం.భర్తకి ప్రమాదం జరగటంతో కూలీగా మారిన ఈమె "ఇంగ్లీష్ విత్ దేహతీ మేడం " అనే యూట్యూబ్ ప్రారంభించిన తర్వాత విదేశీయుల తో పరిచయం తో జీవితం కొత్త మలుపు తిరిగింది. దాదాపు  4లక్షలఫాలోయర్స్ తో టెడెక్స్ జోష్ టాక్ లోపాఠాలు చెప్తోంది.    
మధ్య ప్రదేశ్ కి చెందిన యషీ శ్రీవాస్తవ ఇంగ్లీషు మీడియం లో చదివినా మాట్లాడాలంటే గజగజ భయం. అందుకే స్వంతంగా ఆంగ్లంపై పట్టు సాధించి ఐఈఎల్ టి ఎస్ శిక్షకురాలిగా పేరు పొందిన తర్వాత పల్లెలో పిల్లల కోసం  లెర్నింగ్ విత్ యషీ అనే పేరు తో ఆంగ్ల పాఠాలు నేర్పుతోంది.
  మయన్మార్ లో పుట్టిన  మెర్లిన్ చెన్నైలో స్థిరపడింది. లెక్కలు ఆంగ్లం బోధిస్తూ మంచి పేరు సంపాదించిన ఆమె ఏకాకిగా మిగిలింది. 80 ఏళ్ళ వయసులో బిచ్చకత్తె గా మారిన ఈమె వృద్ధాశ్రమం లో చేర్చారు ఎవరో.అంతా  ఆబామ్మ దగ్గర చదువు కోసం పెరగడంతో ఇంగ్లీషు విత్ మెర్లిన్ గా ఇన్ స్టా లోకి వచ్చి  ఆంగ్ల సంభాషణ లో శిక్షణ ఇస్తుంది. 🌹

కామెంట్‌లు