స్ఫూర్తి ప్రదాతలు 37 సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ
 సిబిఐ ఆఫీసర్లు గా కిడ్నాప్ హత్య కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా చేసిన ఘనత  సంపత్ మీనా  సీమాపహుజా కలది! రాంచీలో తొలి మహిళా ఐపీఎస్ సంపత్ జార్ఖండ్ లో 700 మంది పిల్లల్ని ఆపరేషన్ ముస్కాన్ కింద రక్షణ అమ్మ నాన్న ల ఒడిలోకి చేర్చిన ఘనత సాధించారు. జీనియస్ ఆఫీసర్ గా మానవ అక్రమ రవాణా లో కీలకం గా వ్యవహరిస్తారు సీమా.
 ఎం.ఫార్మసీ చేసి పానిపూరి అమ్మకంతోవెలుగులు చిమ్ముతున్న కొప్పుల పూర్ణిమ కరీంనగర్ వాసి.హెర్బల్ పానిపూరి ఆమె ప్రత్యేకత. 
150 కోట్ల రూపాయల జుట్టు తో బిజినెస్ చేస్తూ సలోనీ ఆనంద్ నిజజీవితంలో కష్టాలు కన్నీరు ఎక్కువ. భర్త భయంకరవ్యాధి కి తగిన సేవలు చేస్తూ  " త్రయా" సంస్థను నెలకొల్పి జుట్టు సమస్యలుఉన్నవారికి బాధను తొలగించే ఆయుర్వేద మందులు అందిస్తున్నారు. 
 నార్గిస్ మొహమదీ మానవహక్కుల కై పోరాటం చేస్తోంది. ఇరాన్లో మహిళలకై పోరాడుతూనే జైల్లో కూడా పోరాటం చేసింది.   ఆమె ఇద్దరు కవలపిల్లలు ఫ్రాన్స్ లో ఉన్నారు.  1972 లో ఇరాన్ లో పుట్టి న  ఈమెమహిళా హక్కులపై గొంతెత్తింది. 154 కొరడాదెబ్బలు 31 ఏళ్ళ జైలుశిక్ష లో అనారోగ్యంపాలైంది.ఆమె ధైర్యం సాహసం సేవలకు నోబెల్ శాంతి బహుమతి పొందిన 19వ స్త్రీ నార్గిస్.
ఇరాన్ నుంచి అమెరికా వచ్చిన నీకా  లీలా అనే కవలపిల్లలు  ఇంజనీరింగ్ చేసి పర్యావరణ హిత బట్టలు తయారు చేస్తున్నారు.  
టోరోంటో లో పిల్లల డాక్టర్ గా ఉన్నారు తుర్లపాటి పద్మిని.1985లో జరిగి న ఎంపరర్ కనిష్కవిమానప్రమాదంలో   ఆమె ఇద్దరు కొడుకులు 14_11 ఏళ్ళ వారు మృతిచెందారు. ఇండియాలో ఉన్న బామ్మ తాతల్ని చూడటంకోసం ఆఇద్దర్నీ పద్మిని దంపతులు విమానం ఎక్కించారు. కనిష్కవిమానప్రమాదంలో 329మంది అసువు లు బాశారు. పెద్ద బాబు శవంసముద్రతీరంలో కొట్టుకుని వచ్చింది. కానీ చిన్న బాబు కనపడలేదు. దాదాపు 40ఏళ్ళు గడుస్తున్నా ఆదంపతులు ఆశతో బతుకుతూ ఇండియా లో బీద పిల్లల కి సాయం చేస్తూ ఉన్నారు.  
2023 విద్యా అమృత్ మహోత్సవంలో నాగలక్ష్మిదేవి తయారు చేసి న లెక్కలు కి సంబంధించిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ దేశం లోనే ఫస్ట్ వచ్చి తెలుగు వనిత గొప్ప తనం చాటింది.  కడప జిల్లా కి చెందిన ఈమె తండ్రి దర్జీపనిచేస్తారు.19వ ఏటటీచర్గా ఆమె కెరీర్ మొదలు ఐంది. దూరవిద్య ద్వారా బి.ఎ. బి.ఇడి.చేశారు. 
అలాగే లెక్కలు అంటే పిల్లలకి ఉన్న భయంపోగొట్టారు కొల్లూరి  నర్సమాంబ.లక్ష్మీస్ టి.ఎల్.ఎం.అనే యూట్యూబ్ ద్వారా ఆమె విద్యలో కిటుకులు నేర్పు తోంది. 
కేరళ కి చెందిన విజి  కోజికోడ్ లోటైలరింగ్ యూనిట్ ని ప్రారంభించారు. ఆపైకుడుంబశ్రీ మహిళా ఉపాధి పథకంలో చురుగ్గా పాల్గొన్నారు. మహిళలకు వాష్ రూం సౌకర్యం కోసం  పోరాడింది.మీ మలమూత్ర విసర్జన కు ప్లాస్టిక్ కవర్లు తెచ్చుకోండి" అన్న యాజమాన్యం పై పోరాటం చేసింది విజి.    కోజికోడ్ లోపబ్లిక్ టాయిలెట్లు వెలిశాయి. 🌹

కామెంట్‌లు