స్ఫూర్తి ప్రదాతలు 38 అచ్యుతుని రాజ్యశ్రీ
 నాసా వారి ఐఎఎస్ పి కోర్సు పూర్తి చేసిన కాలువ జోషితారెడ్డి అన్నమయ్య జిల్లాలోని కంభంవారిపల్లె.ప్రపంచంలో 50 మందికే దొరికే ఛాన్స్ లభించటం అమెరికా స్పేస్ సెంటర్ లో వర్క్ షాప్ లో పాల్గొన్నది.పోలెండ్ లోస్కూబాడైవింగ్ లో శిక్షణ పొందాలి.
డాక్టర్ మాలా శ్రీకాంత్ విదేశాల్లో రాణించిన వైద్యులు.కాన్ఫరెన్స్ కెళ్ళి వస్తుండగా యాక్సిడెంట్ లో డ్రైవర్ చనిపోవటం ఈమెకు తీవ్ర గాయాలయ్యాయి.ఇండియన్ ఏర్ఫోర్స్ లో మిలట్రీ డాక్టర్ మాలా ఒమన్ లో గోల్డెన్ డాక్టర్ గా ఖ్యాతి పొందింది.ఎన్నో సర్జరీలు జరిగాక ఉత్తరాఖండ్ లో హాబీగా అల్లికలు ఆరంభించారు.కానీ చేతులు సహకారం తక్కువ ఐంది.గిరిజన స్త్రీ లకు శిక్షణ ఉపాధి కల్పించారు.అల్లిక చేతివృత్తులతో వారి కి జీవనోపాధి కల్పించారు.దీదీ అని వారు పిలుస్తారు.అదే ఆమె కి ఆనందం.
 ఉపాసన రవికన్నన్ సెరిబ్రల్ వ్యాధితో వీల్ ఛైర్ కే అంకితం ఐంది. వీధిలోబిచ్చగాళ్లను చూశాక విరాళాలు సేకరించి పేదపిల్లల చదివిస్తోంది. "గోపడాయి ఆరంభించిన ఆమె  పల్లెలో విద్యావ్యాప్తికి కృషి చేస్తూ పురస్కారం అందుకుంది.
బెంగుళూరు కి చెందిన దివా ఉత్కర్ష ప్రాజెక్ట్ సూర్యప్రారంభించి షుగర్ వ్యాధి పిల్లలకు ఇన్సులిన్ కిట్స్ మందులు అందజేస్తుంది. డయానా అవార్డు పొందింది. 
ఢిల్లీ కి చెందిన కశ్వి ప్రభుత్వ పథకాలను గూర్చి కూలీశ్రామికులకు వివరిస్తూ  బ్యాంక్ ఖాతాలు తెరిపించి అవార్డ్స్ అందుకున్నారు. 
బొప్పన శ్రియా హాలీవుడ్ నటులతో కల్సి లైంగిక విజ్ఞానంపై యువతకు అవగాహన కల్గిస్తున్నారు. కోవిడ్ టైం లో లఘు చిత్రం నితీయటమే సామాజిక అంశాల ఫై టి.వి.షోలతో ప్రశంసలు పొందుతున్న అమెరికాలో నివసిస్తున్న తెలుగు యువతి 🌹

కామెంట్‌లు