స్ఫూర్తి ప్రదాతలు 39 సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ
 యు.పి.కి చెందిన గీతికా శ్రీవాస్తవ  ఐ.ఎఫ్.ఎస్.ఆఫీసర్. చైనా లో భారత ఏంబసీలో చేసి విదేశాంగ శాఖ లో ఇండోపసిఫిక్ డివిజన్ జాయింట్ సెక్రెటరీ అనుభవాలున్న ఆమె ప్రస్తుతం పాకిస్తాన్ లో డిప్యూటీ హైకమీషనర్గా నియమించబడిన తొలి భారతీయ నారీశిరోమణి.కుటుంబం తోకాకుండా ఒంటరిగా ఆదేశంలో ఉన్న ఆమెను నియమించటంలో అర్ధం మహిళలు ఐతే ఉద్రిక్తతలు తగ్గించటంలో నేర్పరులు అనే నమ్మకం.  జయహో గీతికా
!ఈపూరి షీల తల్లి ని తన3 వ ఏటనే కోల్పోయింది. భర్త ఆటోడ్రైవరు. ఎం.కాం.చేసి   పి.హెచ్. డి.చేసి  తెనాలిలో కాలేజీలెక్చెరర్ గా ఉన్నారు. కొడుకు ఇంజనీరింగ్ చదువు తున్నాడు.కూతురు కూడా ఉంది. భర్త ఉదయం 7నుంచి రాత్రి 11దాకా ఆటోనడపుతూ ఆదర్శ విశాలహృదయునిగా అందరిమన్ననలు పొందుతున్నారు .  
కన్నడ యువతి మందర మొహం మీద పుట్టుమచ్చ ఆమెతో పాటే పెరిగి శాపంగా మారింది. కుడిచెంపపై పూర్తి గా పాకటంతోలేజర్ చికిత్స లు చేయించారు. ఫలితం శూన్యం. ఇన్ స్టాలో రీల్స్ చేస్తూ జర్నలిస్టు గా బాడీ పాజిటివిటీపై అవగాహన కల్గిస్తున్నారు. శారీరకబాధలకు కృంగిపోరాదు.    
కేరళ కుట్టి ఫాతిమా మామూలు శిశువుగానే పుట్టింది. కానీ కుడికాలు ఎదగలేదు. కాలి చేతివేళ్లు శరీరం వంకర్లున్నా ఆమె లో ఆత్మ విశ్వాసం మెండు.18దాటాక పనికిరాని కాలుని తీసేశారు డాక్టర్. ప్రోస్థటిక్ లెగ్ తోడాన్సు మోడలింగ్ చేస్తూ ఎం.ఏ.పాసైఅందాలపోటీల్లో సత్తా చాటుతోంది.   
స్మితా శ్రీవాస్తవ అద్భుతాలు చేయలేదు కానీ  47 ఏళ్ల వయసులో కూడా 7అడుగుల 9 అంగుళాల జుట్టు తో గిన్నిస్ రికార్డ్ కెక్కిందామె.
భర్త  రెండు కిడ్నీలు పాడైతే  చికిత్స చేయించిన  రమణి  ప్లాస్టిక్ వ్యర్థాల గూర్చి ఆలోచించి  మల్కాపురంలో మొక్క జొన్న పిండి తో సంచులు తయారు చేయిస్తోంది.రకరకాల సంచులు బయోపాలిమర్ పిండి తో తయారయ్యే సంచుల వల్ల 30మందికి  ఉపాధి కల్పించారు. కొడుకు లిద్దరూ డాక్టర్స్
.ప్రపంచంలో ఎత్తుఐన యుద్ధప్రాంతాల్లో సియాచిన్ లో తొలి మహిళా మెడికల్ ఆఫీసర్  గీతికా కౌల్. 
సహీనా హుసేన్ 14 లక్షలమంది ఆడపిల్లలు చదువు కోసం కృషి చేసి అంతర్జాతీయ వైజ్ ప్రైజు అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో సంపన్న కుటుంబం లో పుట్టిన ఈమె సవతితండ్రి సతాయిస్తుంటే  ఇల్లు వదిలి బంధువుల సాయంతో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లో చదివింది.ఇండియా కు వచ్చి రాజస్థాన్ బాలికలకోసం కృషి చేసింది.అక్కడ మేకలకు విలువ ఇస్తారు కాని ఆడపిల్ల అంటే తుస్కరిస్తారు.పిచ్చికుక్కలా తనని తరిమేవారు పెద్దలు   ...అని అంటారు సహీనా.24 వేలపల్లెల్లో బాలికల చదువు కోసం కృషి చేస్తూ 4 కోట్ల బహుమతి అందుకున్నారు 🌹

కామెంట్‌లు