స్ఫూర్తి ప్రదాతలు 40 సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ

 నేడు అమ్మాయిలు కష్టాలు పడుతూ ఐ.టి.రంగంలో దూసుకుపోతున్నారు. యు.పి.లోని పల్లెలో పుట్టిన ఛవీసింగ్ డిగ్రీ చదువుతూ 3 కోట్ల స్కాలర్షిప్ పొంది యు.ఎస్. లోఇంటర్నేషనల్ పాలిటిక్స్ అండ్ అస్ట్రాలజీలో ఫ్రీ చదువు తో రాణిస్తోంది.జాన్వీ మౌర్యుల ఛత్తీస్గడ్ లోని గిరిజన పల్లెల్లోవ్యవసాయం సాగుపద్ధతులు కి దోహదం చేసే ఉద్దేశం తో ఒహాయోయూనివర్శిటీలోదాదాపు 2 కోట్ల స్కాలర్షిప్ పొందిన తొలి యువతి.   ఆమె జాన్వీ మౌర్య.పాట్నా ఎన్.ఐ.టి.లో చదివిన అదితి ఫేస్ బుక్ లండన్ ఆఫీసు లో ఫ్రంట్ ఎండ్ ఇంజనీరు గాదాదాపు 2 కోట్ల జీతం తో రాణిస్తోంది. ఐఐటి లో చదివిన  రాశి బగ్గా అట్లాసియన్ లో 85లక్షలజీతంతో రాణిస్తోంది . అమెజాన్ కోడింగ్ పోటీలో నెగ్గి రేపాక ఈశ్వరీప్రియ 85 లక్షల ఏడాది జీతం తో  దూసుకుపోతున్న తెలుగు అమ్మాయి.      
 113 ఏళ్ల  పిన్నమనేని అనసూర్యావతమ్మ తన పని తాను చేసుకుంటూ 12గంటలు హాయ్ గా కునుకు తీస్తారు. ప్రతి ఎన్నికలలో ఓటువేస్తున్నారు.స్వాతంత్ర్య పోరాటంలో భర్త తో సహా అంతా జైల్లో ఉంటేకుటుంబ భారాన్ని మోశారు.తనకు వచ్చి పింఛన్ ని పేదవిద్యార్ధులకు పంచుతారు.  డాక్టర్ జి.నాచియార్ తమిళ నాడులోరైతు కుటుంబం లో పుట్టారు.అన్న ప్రోత్సాహం తో కంటిడాక్టర్గా  సేవచేస్తూ పద్మశ్రీ అందుకున్నారు. దేశం లో తొలి న్యూరోఆఫ్తల్మాలజిస్ట్ ఆమె! యువతులు శిక్షణ ఇస్తున్నారు. 500మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.వీరంతా కంటిపరీక్షలు ఆపరేషన్స్ అప్పుడు సహకరిస్తారు. అరవింద్ ఐ కేర్ లో  87లక్షలమందికి కంటి ఆపరేషన్స్ చేశారు. ప్రపంచంలోని 4వేలమందిపైగా కంటి డాక్టర్లు  ఈసంస్థలో పనిచేస్తున్నారు. 80ఎకరాల్లో సేంద్రియ సాగుతోఆరోగ్యంపై దృష్టి పెట్టిన  ఈమెవయసు85ఏళ్లు🌹
కామెంట్‌లు