కేవీర్ పాఠశాలలో ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

 స్థానిక కేవీర్ పాఠశాలలో ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి.
పాఠశాల ప్రిన్సిపాల్ సాదు శ్రీనివాస రెడ్డి గారు జాతీయ జెండాను ఆవిష్కరించి, అనంతరం పాఠశాలలో ఈ సంవత్సరం నుండి ప్రత్యేక కోర్స్ ఐఐటీ ని ప్రవేశం పెడుతున్నట్టుగా పోస్టరను ఆవిష్కరించడం జరిగింది,
అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దేశ భక్తి తో ముందుకు నడవాలని ప్రతి విద్యార్ధి కూడా ఉన్నతంగా చదువుకుని దేశం గర్వించే నాయకులుగా ఎదగాలని, ప్రతి విద్యార్ధికి అవసరమైన విద్యను అందించడానికి ఎప్పుడు, ఎల్లప్పుడూ కేవీర్ పాఠశాల ముందు ఉంటుందని తెలియజేసారు.
అనంతరం కార్యక్రమంలో విద్యార్థిని,విద్యార్థులు ఆటపాటలతో నరత్యాలు, డాన్స్, పిరమిడ్స్, చేస్తూ అందరిని అలరించారు,పాఠశాల పోటీలలో ఉత్తమ ఫలితాలు పొందిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ సాదు శ్రీనివాస రెడ్డి గారు బహుమతులు అందజేశారు.కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం,వైస్ ప్రిన్సిపాల్ గారు, ఉపాధ్యాని,ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు