గోపి మారిపోయాడు..!;- సూరె. గోపి-8వ తరగతి బి సెక్షన్ -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోదాడ -సూర్యాపేట జిల్లా 6305393291

 అనగనగా కోదాడ అనే ఊరిలో గోపి అనే విద్యార్థి కొత్తగా ఆరవ తరగతిలో చేరాడు. అతడు చాలా అల్లరివాడు. ఒకరోజు విరామ సమయంలో పాఠశాల ప్రాంగణంలో ఉన్న చెట్టు ఎక్కి ఆటలు ఆడసాగాడు. అది చూసిన ప్రధానోపాధ్యాయుడు అతడిని పట్టుకున్నాడు. గోపి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి స్కూలుకు రమ్మని చెప్పాడు.
         కొంత సమయం తర్వాత వాళ్ళ అమ్మ పాఠశాలకు వచ్చింది. "ఏం జరిగింది సార్. ఎందుకు రమ్మన్నారు" అని ఆరా తీస్తూ అడిగింది.
       "అమ్మా! వీడు తరగతి గదిలో అల్లరి చేయడమే కాక, చెట్లు, పుట్టలు ఎక్కుతున్నాడు. జారిపడితే చాలా ప్రమాదం. ఎంత చెప్పినా వినట్లేదు. ఈ పాఠశాలలో వీడిని చూసి మిగతా పిల్లలు కూడా చెడిపోతారు. అందుకే టి.సి. ఇస్తాను తీసుకెళ్లండి" అని వివరంగా చెప్పాడు ప్రధానోపాధ్యాయుడు ."సార్.. మీరు అలా అంటే ఎలా సార్? నేను వానికి సర్ది చెబుతాను. ఈ ఒక్కసారికి నా మొఖం చూసి  క్షమించి వదిలేయండి" అని ప్రధానోపాధ్యాయుడిని బతిలాడింది.
          కాసేపు ఆలోచించి "సరే.. ఇదే చివరి అవకాశం. ఇంకోసారి ఇలా చేస్తే బడి నుండి పంపి వేస్తాను" అని గట్టిగా చెప్పి పంపాడు. పాఠశాల పూర్తవుగానే సంచి భుజాన వేసుకొని భయపడుతూనే ఇంటికి వెళ్ళాడు గోపి.ఇంట్లోకి వెళ్లి సంచిని ఒక మూలన పెట్టాడు. కొడుకు కోసం చూస్తున్న  తల్లి ఒక కర్ర అందుకొని గోపీని  ఇరగబాదింది."వామ్మో.. వాయ్యో.. ఇంకెప్పుడు అలా చెయ్యను" అని తల్లిని బతిమాలాడు.ఆ రాత్రి పడుకున్నాడు  అనే గానీ గోపికి నిద్రపట్టలేదు."నేను ఇలా చేయడం వల్లే కదా అమ్మ బాధపడుతుంది. నాకు ఇన్ని దెబ్బలు అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు .
     మరుసటి రోజు నుంచి చెట్లు ఎక్కడం మానేశాడు. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా వినసాగాడు. అనతి కాలంలోనే మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు గోపి.

కామెంట్‌లు