నల్లనల్లాని పిలగాడు
సల్లని గుండెలోడు రేపల్లెలో
నంద యశోదమ్మల ముద్దుల గారాల బిడ్డడు
చిలిపి అల్లరి బుల్లోడు
"నాకేం ఎరుక?" అంటూ బుంగమూతి బుకాయింపుతో
మూతి ముడిసి సల్లంగ మెల్లంగా ఇంటింటా దూరి
ఉట్టి మీది కుండల్ల పాలు పెరుగు నల్లపిల్లి లెక్క దోస్తుల పైకెక్కి ఆరికింత పెట్టి తానంత బొక్కి అమ్మ సేతికి సిక్కకుండా
సిటికెలోన గాయబ్
పాలు పెరుగు ఎన్న తినని పిలగోల్లు సీపురుపుల్లలు
మంచిగ సంటోల్లకితాగిపిస్తే ఎంసక్క గుమ్మడి పండు లెక్క ఉంటోరు అని ఆనాడే సోసలిజం మాట సెప్పిండు
పిల్లలు దేవుల్లంటూ కులం సూడకుండా జనమంతా " నావోల్లే " అన్నడు
ఆవులుంటేనే పాడిపంటలు
పైరులతో పల్లెలు పచ్చంగ
పిల్లనగ్రోవి పాటతో ఏపుగా ఎదుగు
మస్తుగ ఆవుపాలిస్తదంటూ
నేటి మాటను ఆనాడే సెప్పిండు
మన సిన్ని కిట్టయ్య_ ఆమాట ఇన్కుంటే సాలయ్యా
.. స్వస్తి..

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి