బుద్ధుని మహా పరి నిర్వాణం ;- కుసుమాంజలి, -9 6 7 6 6 8 9 8 0 1 విజయవాడ.
 ధమ్మ పరివ్యాప్తి కోసం కానుకలు బహుమతులు ఆతిథ్యం లను పొందడానికి అన్ని అర్హతలు కలిగి ఉండడమే కాక పుణ్య సoచయానిచ్చే పూజనీయమైంది కూడా కాబట్టి ఇలాంటి సంఘం పట్ల విశ్వాసాన్ని పెంచుకుంటూ నాలుగు జతల మనుషులు ఆర్య సత్యo వల్ల మరో నాలుగు రకాల ఫలాలతో ఎనిమిది రకాల ఉద్గల పురుషులవుతాడు ఇలా బుద్ధుని పట్ల ధమ్మo పట్ల సంఘం పట్ల పరిపూర్ణ విశ్వాసం శ్రద్ధ గౌరవాలను కలిగిన ప్రతివాడు ఆర్యుల మెప్పులు పొందే విధంగా మచ్చలు లోపాలు లేని అఖండమైన శీలంతో పాటు సమాధి ప్రజ్ఞలను పొందిన పరిపూర్ణ జ్ఞాని అవుతాడు ఇదే దమ్మ దర్పణంతో అని వివరించాడు బుద్ధుడు  నాది కాలోని ఇటుక రాతిశాలలో నున్నప్పుడు తధాగతుడు భిక్షువు లకు శీల సమాధి ప్రజ్ఞల గురించి వాటిని సoతరించుకున్న వారికి శాశ్వత ఆనందాన్ని నిర్వాణ ఫలాన్ని గురించిన ధర్మ బోధ గావించాడు.కొంతకాలం నాథిక భిక్షు సంఘంతో గడిపిన బుద్ధుడు భిక్షు సంఘం వెంటరాగా వైశాలికి చేరుకొని ఆమ్రపాలకి చెందిన మామిడి తోపులో విడిది చేశాడు  ఆ సందర్భంగా బుద్ధుడు భిక్షువులకు భిక్షువులారా  ప్రతి బిక్షపు స్మృతితో ఎరుక గల వాడై ఉండాలి శరీరాన్ని శరీరంగా వేదనలను వేదనలుగా చేతనను చేతనగా మానసిక భావనలను మానసిక భావనలుగా గుర్తించి జంకులేని తృష్ణ లేని స్థితికి చేరుకొని సతి తో జీవించాలి అంతేకాదు ప్రతి భిక్షువు చారికలో నడిచేటప్పుడు గాని ముందు వెనక చూసేటప్పుడు గాని శరీర అవయవాలను ముడుచుకునేట్లు కానీ దాచుకునేటట్టు గాని సాంఘాటివి శరీరం పై కప్పుకునే వస్త్రాన్ని ఇతర ఛీవరాలను భిక్షు పాత్రాలను ధరించినప్పుడు గాని తినేటప్పుడు గానీ తాగేటప్పుడు గాని నడుస్తున్నప్పుడు నిలబడినప్పుడు కూర్చొని ఉన్నప్పుడు గాని మాట్లాడుతున్నప్పుడు గానీ మౌనంగా ఉన్నప్పుడు గానీ తాను ఆ పనిలో ఉన్నారన్న ఎరుకతో ఉంటాడు ఈ విధంగా ప్రతి భిక్షువు ఎరుకతో స్మృతి తో అప్రమత్తతతో జీవించాలి అని బోధించాడు.తన మామిడి తోపులో బుద్ధుడు బస చేశాడన్న సంగతి వైశాలి నగర శోభిని గణిక ఆమ్రపాలి కి తెలిసింది వెంటనే దర్శించి భోజనానికి ఆహ్వానించాలి అనుకుంది  ఆయనను కలవడానికి సమాయత్తమైంది అందుకు అనేక రథంలను సిద్ధం చేసి ఒక దానిలో తాను బయలుదేరి వనాన్ని చేరుకుంది బుద్ధుడు విహరించిన చోటుకు దూరంగా రథం దిగి కాలినడకన బుద్ధుడు ఉన్న చోటికి చేరి తలవంచి నమస్కరించి బుద్ధునికి ఎదురుగా ఒక ప్రక్కగా వినoమ్రoగా కూర్చుంది గమనించిన బుద్ధుడు ఆమ్రపాలి కి ధమ్మo పట్ల అవగాహన కావించాడు అప్పుడు ఆమె భగవాన్ భిక్షు సంఘంతో తథాగతుడు రేపు మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని వేడుకోంది అందుకు అంగీకరించాడు బుద్ధుడు ఆనందంతో లేచి నమస్కరించి బయలుదేరి వెళ్ళింది ఆమ్రపాలి.
.=========================
సమన్వయం ; డా. నీలం స్వాతి 

కామెంట్‌లు