ఏమ్మా, మంగమ్మ! ఏమైంది మీ బాబుకు...
అయ్యా! మా పిల్లోడిని ఏదో పాము కరిచినట్లుంది.బాగా నొప్పిగా ఉంది అంటున్నాడు. ఏ పాము కరిచిందో తెలియడం లేదు.
అయ్యో! మరి బాబును ఎక్కడికి తీసుకెళుతున్నావు.
అయ్యా! పాముకాటుకు మంత్రం పెడతానని పెద్దయ్యగారు చెప్పారు. మా పిల్లోడిని అక్కడికి తీసుకొని వెళుతున్నాను.
అదేంటి, అమ్మా!మంత్రాలకు చింతకాయలు రాలవని నీకు తెలుసుగా.
లేదయ్యా, పెద్దయ్యగారి చేయి మంచిది. ఆయన నోటితో మంత్రం చెప్పి, చేత్తో మందు ఇస్తే, ఎంతటి పాముకాటుకైనా విరుగుడు దొరుకుతుంది. మొన్న భూషయ్య కొడుకును కూడా పాము కరిచింది. అయ్య గారి మంత్రం పనిచేసి, ఆ అబ్బాయి బతికాడు.
లేదు మంగమ్మ, భూషయ్య కుమారుడిని విషం లేని పాము కరిచి ఉంటుంది. దీనితో అయ్యగారు మంత్రం పని చేసి నట్లు నమ్మి ఉంటారు.అంతే గానీ మంత్రాలు పాము, తేలు కాటుకు విరుగుడుగా పని చేయవు. అన్ని పాములు విషపూరితమైనవి కావు. నీవు ఏ మాత్రం ఆలస్యం చేయకు. బాబును దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళదాం. అక్కడ డాక్టర్స్ పరిశీలించి, ఏ పాము కరిచిందో నిర్ధారణ చేసి,తగిన చికిత్స చేస్తారు అన్నాడు సుబ్బారావు.
అలాగా అయ్యా. నాకు ఇప్పుడు దాకా తెలియదు.నీ మాట ఎందుకు కాదనాలి, ఆసుపత్రికి వెళదాం పదా అంటూ కొంత ధైర్యం తెచ్చుకొని సుబ్బారావును అనుసరించింది మంగమ్మ.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి