సినీ రంగంలో మాకు ఆత్మీయ మిత్రుడు వీరయ్య గారు వారు పల్నాటి చిత్రం సినిమా తీస్తున్న సమయంలో సంగీత భరితం గా ఉండాలని ఎస్ రాజేశ్వరరావు గారిని సంగీత దర్శకుడుగా నియమించుకున్నారు అంతకుముందే ఘంటసాల వారికి పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది ప్రభుత్వం అది రాజేశ్వరరావు గారికి బాధగా ఉండి ఉండవచ్చు మనసులో దానిలో పాత్ర హరినాథ్ ఒక పద్యం పాడిoచడానికి దృశ్యం ఏర్పాటయింది ఆ పద్యం పాడడానికే ఘంటసాల వారిని నియమించారు మూడు పాదాలు బాగానే ఉన్నాయి నాలుగో పాదంలో మాత్రం ఘoగంటసాల పలకని చిన్న రాగాన్ని అతికించారు ఘంటసాల వారు పాడుతూ దాదాపు 17 సార్లు రికార్డు చేసినా అది రాజేశ్వరరావు గారికి నచ్చలేదు ఇంటికి వెళ్లి టీ తాగి వస్తానని చెప్పి ఘంటసాల వారు వెళ్ళిపోయారు.అప్పుడు నేను డాక్టర్ వెంకట్ రాజు గారు బయలుదేరి వెళ్లి బాలమురళీ గారిని కలిసి ఇదే విషయం చెప్పి మీరు పాడాలి అని అడిగితే ఘంటసాల మాస్టారు ఏమైనా అనుకుంటారేమో అన్నారు ఆయన కు ముందే చెప్పాను అని ఒక చిన్న అబద్ధం కూడా ఆడాను సరే మాతోపాటు వచ్చారు రాగానే రాజేశ్వర రావు గారు ఆత్మీయంగా ఆహ్వానించి విషయం చెబితే ఫస్ట్ టేక్ లోనే ఓకే చేశారాయన అలాంటి ప్రజ్ఞావంతుడు బాలమురళి గారు తెలుగు నాట పుట్టి కర్ణాటక సంగీతాన్ని ఆపోసన పట్టి నాద వినోదాన్ని సంగీతాభిమానులకు పంచిన గాన గంధర్వుడు పద్మ విభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.ఆయన దాటి వెళ్లిన ఆ ద్వారాన్ని గౌతమ ద్వారమని పిలిచారు బుద్ధుడు గంగా నదిని దాటడానికి వచ్చినప్పుడు నది పొంగిపొర్లుతూ పారుతుంది ఆవలి ఒడ్డుకు చేరవలసిన వారు పడవలు తెప్పలు బల్ల కట్టుల కోసం ఎదురుచూస్తున్నారు బుద్ధుడు తన బలంతో వెంటనే ఆవలిగట్టుకు వచ్చి చేరాడు నదిని దాటిన తర్వాత ఆ ఒడ్డున గంగను దాటడానికి పడవలు తెప్పలు బల్లకట్టుల కోసం ఎదురుచూస్తున్న వారిని చూసి పొంగుతున్న నదిని దాటడానికి ఎవరి ప్రయత్నంలో వారు ఉండగా జ్ఞానులు అప్పటికే నదిని దాటి వెళ్లారని కొందరు సంసార ప్రవాహాన్ని దాటడానికి పడరాని పాట్లు పడుతూ ఉండగా జ్ఞానులు మళ్లీ పుట్టుక లేని శాశ్వత ఆనందాన్ని ఇచ్చే నిర్వాణమనే ఆవలికట్టుకు చేరుకున్నారని ప్రకటించాడు బుద్ధుడు తరువాత ఆనందా ఇక మనం కోటి గ్రామం వెళదాం అని బుద్ధుడు చెప్పగా ఆనందుడు తగిన ఏర్పాటు చేశాడు.
=================================
సమన్వయం ; డా. నీలం స్వాతి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి