కర్ణాటక సంగీతంలో సాహిత్యానికి సముచిత ప్రాధాన్యతను ఇచ్చే పాట బాల మురళిది దానికి ఉదాహరణ కావాలి అంటే తన సొంత సంస్థ ద్వారా వచ్చిన సినిమాలో భానుమతి గారు పాడిన కీర్తన పక్కన నిలబడి అన్న దానిని సక్రమంగా అక్షరాలను సరిదిద్దున వాడు బాలమురళి పక్కలా కాకుండా ప్రక్కల అనే పాట కీర్తనలోనే ప్రతి అక్షరానికి విలువనిస్తూ వినేవారికి వీనుల విందు చేయడం ఆయనకు అలవాటు అయితే బాల మురళి గారికి కర్ణాటక సంగీతం రాదు వారు పాడేది కర్ణాటక సంగీతమే కాదు అన్న విమర్శలతో కొంతమంది విమర్శకులు ముందుకు వచ్చారు దానికి సమాధానంగా ఇది మురళి సంగీతం అని సమాధానమివ్వగలిగిన థీశాలి ఆయన.దీనికి ఒక ఉదాహరణ చెప్పాలి స్వామి చిరంతరానంద ఆంగ్లంలో 21 రోజులు గీత ను గురించిన ఉపన్యాసాలు ఇచ్చి చివరి రోజున అనుమానాలు ఉంటే అడగండి అన్నారు మా ఎకనామిక్స్ లెక్చరర్ గారు రామ నరసింహం గారు లేచి మీరు ఫలానా రోజు మాట్లాడిన దాంట్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి అన్న తర్వాత స్వామీజీ షేక్స్పియర్ లో ఎన్ని తప్పులు ఉన్నాయి అని అడిగాడు దటీజ్ షేక్స్పియర్స్ స్టైల్ అని సమాధానం ఇచ్చారు రామ నర్సింహం గారు ఎస్ థిస్ ఇస్ చిన్మయాస స్టైల్ అని వేదిక దిగి వారి వద్దకు వచ్చి ఎంతో ఆప్యాయంగా వారిని వేదిక పైకి తీసుకువెళ్లి శాలువా కప్పి సత్కరించారు అలాంటి సన్మానాలు బాలమురళి గారికి ఎన్ని జరిగి ఉంటాయి ఆయన జీవితంలో హంస వినోదిని వంటి కొత్తరాగాలను వెలుగులోకి తీసుకురావడమే కాక మూడు నాలుగు స్వరాల రాగాలను సైతం జోప్పించి పాడి మెప్పించగలగటo ఆయనకు సాధ్యమైంది ఆయన సంగీత సాహిత్యాలలో చేయని వినూత్న ప్రయోగం లేదు అందుకే భారతదేశంలో ఉన్న అత్యున్నత పురస్కారాలు అన్ని ఆయన చేతికి వచ్చాయి బాల మురళి ఈ విశ్వమంతా పర్యటించి 25 వేల వరకు కచేరీలు నిర్వహించారు భీమసేన జోషి జస్రాజ్ పర్వీన్ సుల్తానా వంటి వారితో జుగలబందీ నిర్వహించారు పర్వీన్ సుల్తానా గారిని విజయవాడకు తీసుకువచ్చి మా కేంద్రంలో వారి పాట కచేరి ని ఏర్పాటు చేసిన దానికి నేను అనౌన్సర్ గా ఉండడం నా అదృష్టం ఆమె పాడిన గంట హిందుస్థానీ సంగీతం అరే ఇంతలోనే అయిపోయిందా అనేటట్లు శ్రోతలను అలరించారు తనను గురించి గాక ఇతరులను కూడా తీసుకువచ్చి గౌరవించే సంప్రదాయం వారికి ఉంది ఎన్నో దేశీ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు ఆయనను సత్కరించాయి వేలాదిమంది ఏకలవ్య శిష్యులు ఉన్నారు ఆయనకు.
========================================
సమన్వయం ; డా. నీలం స్వాతి
========================================
సమన్వయం ; డా. నీలం స్వాతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి