: ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.
 హిందుస్థానీ గాత్ర సంగీతంలో ప్రావీణ్యం సంపాదించిన ఓలేటి వెంకటేశ్వర్లు గారు నోరు విప్పితే బడే గులా మాలిఖాన్ పాడుతున్నారన్నoత అనుభూతిని పొందుతాం  కర్ణాటక సంగీతంలో పేరు తెచ్చుకున్న ఓలేటి గారు హిందూస్థానీలోనూ అంతటి పేరు తెచ్చుకున్నారు యక్షగానాల నిర్వహణలో భజనలు భక్తి కీర్తనలు చేయడంలో నిష్ణాతులు  ఇవాళ మల్లాది సూరిబాబు గారికి సంగీతంలో అభిరుచి కలిగిందంటే అది వారి పుణ్యమే అని అనేకసార్లు సూరిబాబు చెప్పారు  అటు సీతారాం ఇటు విలియం చార్లెస్ తబలా వాయిద్యంలో మంచి పేరు తెచ్చుకున్నారు ఇలాంటి గొప్ప కళాకారులతో కలిసి ఆకాశవాణిలో పనిచేయడం అది నా అదృష్టం కాక మరేమిటి.వయోలిన్ వాయిద్యమనే నాలుగు తీగలతో నిర్మితమైన పరికరం అని మన మనోఫలకంపై చిత్రతమవుతున్నది విజయనగరం లో ద్వారo వెంకటస్వామి నాయుడు గారి నుంచి విజయవాడలోని అన్నవరపు రామస్వామి గారి వరకు నీ స్నేహితులైన కళాకారులను చాలామందిని మనం చూసాం కానీ  ఏడు తీగలతో నిర్మితమైన వైరైన వాద్య పరికరాలు మనం చూడలేదు  సప్త స్వరాలను ఏడు తీగల మీద పలికించగలిగిన ఒకే ఒక గొప్ప కళాకారుడు మైసూర్ చౌడయ్య గారు  ఆయన కూడా విజయవాడ కేంద్రానికి రావడం కార్యక్రమాలు ఇవ్వడం మన అదృష్టం వారి పేరుతో ఏడు 
 తీగల వైలిన్ ఆకారంలో అందమైన సుందరమైన ఆకర్షణీయమైన భవనాన్ని బెంగుళూరు ముఖద్వారం దగ్గర ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం.కర్ణాటక రాష్ట్ర ప్రజలకు కళలు కళాకారులు అన్నా ఎంతో  ప్రేమ మరి కళలకు కాణాచి విజయవాడ అని చెప్పుకుంటున్న మనకు ఆ ప్రేమ లేదా మన ప్రభుత్వానికి కళలు అంటే చిన్న చూపా  ఇప్పటికైనా వారి కళను వచ్చేతరం వారి జ్ఞాపకం చేసుకునేటట్లుగా శాశ్వతంగా ఓ జ్ఞాపకం ఉండడం ఎంతో ఆవశ్యకం  ఇన్ని సుగుణాలు ఉన్నాయి కనుకనే  అన్నవరపు రామస్వామి గారి జీవిత చరిత్ర మొత్తం నా వీడియో గ్రంథాలయాలకి మీ మాటల్లో మీ జీవితం పేరుతో వీడియో చేసి భద్రపరిచాను వారి గురించి తెలుసుకోవాలనుకునే వారికి కానీ వాళ్ళ జీవితంపై రిసెర్చ్ చేసేవాడు కానీ ఈ  వీడియో ఉపయోగపడుతుందని నా ఆకాంక్ష  అలాంటి వారికి ఎన్ని సన్మానాలు చేసినా తక్కువే  భగవంతుడు వారికి పూర్ణ ఆయుర్దాయాన్ని 132 సంవత్సరాలు ఇవ్వాలని ఆ రోజు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండాలని  ప్రార్థిస్తూ అస్తు.
=========================================
సమన్వయం . డా. నీలం స్వాతి 

కామెంట్‌లు