ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి-విజయవాడ కేంద్రం,-9492811322
 ఆ తరువాత నేను విశాఖపట్నం బదిలీపై వెళ్లినప్పుడు  అక్కడ వాతావరణం అంతా నాకు కొత్త  ఏ ఒక్కరి పరిచయము నాకు లేదు  రెండు మూడు రోజులు అయిన తరువాత  ఒక్కొక్కరూ నాకు పరిచయం కావడం  నా గురించి వారికి వారి గురించి నాకు తెలియడం  ఆ తరువాత ప్రత్యేకంగా సివి సూర్యనారాయణ మూర్తి గారు మేము సివి అని పిలుస్తాం  వారి పరిచయంతో  నాకక్కడ  మంచి  స్థానం దొరికింది  ఒకరోజు అనుకోకుండా అచ్యుతరామరాజు గారు రావడం  వారు ఏకపాత్రాభినయం  చదవటాన్ని నేను రికార్డు చేయడం కాకతాళీయం చదువుతున్నప్పుడు  కొన్ని పదాలు తప్పులు రావడంతో  రికార్డ్ చేయడం ఆపి చేసి  వారి దగ్గరికి వెళ్లి నిదానంగా విషయం   చెప్పాను  వారెంతో సౌమ్యంగా  నా మాట వినడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది.కార్యక్రమం పూర్తి అయిన తర్వాత వారి ఇంటికి వెళుతూ  నన్ను ఒకసారి  కలిసి వెళదామని వచ్చారు  మీకు ఆ తప్పులు ఎలా తెలిసాయి అన్నది వారి మొదటి ప్రశ్న  ఆ ఏకపాత్రను నేను కూడా  వేదికపై ప్రదర్శించాను అని చెప్పేసరికి నాపై ఒక మంచి భావం ఏర్పడింది మధ్య మధ్యలో వారింటికి తీసుకు వెళ్ళడం  కాలక్షేపం చేయడం వారి సన్నిహిత మిత్రులందరినీ నాకు పరిచయం చేయడం వల్ల అక్కడ ఉన్న నటీనటులు రచయితలు కవులు పరిచయం కావడం  వారందరితో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని  వారి రచనలను ఆకాశవాణిలో ప్రసారం చేయడానికి అవకాశాలను కూడా కల్పించారు  అలా వారు నాకు చాలా  సన్నిహిత మిత్రులు అయినారు.ఒకరోజు మాటల సందర్భంగా రాజుగారు నన్ను  మీ నాన్నగారి గురించి తెలియజేయండి  అని అడిగారు  మా నాన్న పేరు ఆరుమళ్ల సుబ్బారెడ్డి గారు  అని చెప్పగానే  ఆయన లేచి వచ్చి నన్ను కౌగిలించుకొని  నా స్నేహితుడి బిడ్డవా అని  తాను బెజవాడ గోపాల్ రెడ్డి గారు  మా నాన్నగారు  కాకాని వెంకటరత్నం గారు  కలిసి జైలులో ఉన్నప్పుడు వారి కార్యక్రమాలను గురించి  మా నాన్న అభ్యుదయ భావాలను గురించి  మా అందరికీ ప్రతిరోజు పత్రిక  తెప్పించే విషయంలో అధికారులతో పొట్లాడే విషయం దగ్గర నుంచి  అన్నీ సవివరంగా   చెప్పారు రాజుగారు  మీ నాన్నగారు మేమంతా నీవు నీవు అనుకునే స్నేహితులమే  మాలో మాకు పరపొచ్చాలు ఏమి లేవు  తర తమ భేదాలను గురించి  ఆలోచించే వారం కాదు అని చెప్పినప్పుడు నాకెంతో ఆనందం అనిపించింది.
==========================================
సమన్వయం ; డా. నీలం స్వాతి 

కామెంట్‌లు