ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,=9492811322.
 ఆకాశవాణిలో  సంగీత కార్యక్రమాలను కూడా ప్రారంభం చేద్దామన్న అభిప్రాయంతో  దానికి సంబంధించిన అధికారులందరూ కూర్చొని ఒక నిర్ణయం చేసి  ఆ విషయాన్ని ఢిల్లీ వారికి తెలియజేసినప్పుడు వారు  తక్షణం అమలు చేసుకోమని  అనుమతినిచ్చారు  అలా ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి సంగీత ప్రయోక్తగా  మ్యూజిక్ ప్రొడ్యూసర్  విజయవాడకు వచ్చారు  అంతవరకు విజయవాడ కేంద్రం మిగిలిన కేంద్రాల నుంచి రిలే చేసుకోవడం తప్ప సొంత కార్యక్రమాలు లేవు  మురళి గారు వచ్చిన తర్వాత  భక్తి రంజని కార్యక్రమాల నుంచి సంగీత శిక్షణ కార్యక్రమాల వరకు  తెలుగు ప్రసారం చేసే అన్ని కేంద్రాలు  తమిళ కన్నడ మలయాళం  కేంద్రాలన్నీ కూడా రిలే చేసుకొనే స్థాయికి వచ్చింది  అలా ప్రతి విషయంలోనూ సంగీతానికి ప్రథమ స్థానం వచ్చేట్లుగా  కృషి చేసిన వారు బాలమురళి గారు.వీరి ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1971లో పద్మశ్రీ 1991లో పద్మభూషణ్ పురస్కారాల ను ఇచ్చి గౌరవించిoది కేంద్ర ప్రభుత్వ అకాడమీ అవార్డు కూడా బాలమురళికి దక్కింది అందుకే కేంద్ర ప్రభుత్వ సంగీత అకాడమీ భారత్ మురళీకృష్ణ గోల్డెన్ జూబ్లీ పురస్కారాన్ని చేసింది ఫ్రాన్స్ ప్రభుత్వం 2005లో బాలమురళి కి ప్రతిష్టాత్మక అవార్డు ప్రదానం చేసింది శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మద్రాసు విద్యాలయం కలకత్తా రవీంద్ర విశ్వ విద్యాలయం హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ టెక్కలి లాజికల్ విశ్వవిద్యాలయం బాలమురళీకృష్ణ కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశాయి  కచేరి చేయడానికి బాలమురళీకృష్ణ ప్రత్యేకంగా సాధన చేసేవాడు కాదు వేదిక పైకి వెళ్ళాక ఆశువుగా పాడేవారు మద్రాసులో ఒకసారి మురళీకృష్ణ  సరస్వతీ బృందంలో కలిసి కొన్ని బెంగాలీ లలిత గీతాలను ఆలపించారు.ఆ కార్యక్రమం కలకత్తా దూరదర్శన్ లో పునః ప్రసారమైనప్పుడు వీక్షించి పులకించిన బెంగాలీ శ్రోతల కోరిక మేరకు బాలమురళీ చేత రవీంద్రుని గీతాలు పాడించి కలకత్తా దుర్గా దర్శన్ ప్రసారం చేసింది ఆ విషయంలో బెంగాలీ గాయని సుచిత్ర మిశ్రా ఆయనకు సహకరించింది బాల మురళి ఆంధ్ర ప్రదేశ్ లలిత కళల అకాడమీ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న సమయంలో నూతన ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన ఎన్టీ రామారావు గారు చేశారు కళాకారులకు చేసినదానికి అవమానంగా భావించిన బాలమురళి ఎన్టీఆర్ తన నిబందన మార్చుకునేంతవరకు ఆంధ్ర లో కచేరి చేయమన్నాడు Dr చెన్నారెడ్డి అభ్యర్థనతో హైదరాబాదులో బాలమురళి మరల కచేరిలు  ప్రారంభించారు ఆ తర్వాతే ఎన్టీఆర్ పదవిలోకి వచ్చాక బాలమురళిని పిలిచి గౌరవించడంతో యధాతంగా ఆంధ్రప్రదేశ్  లో కచేరీలను  ప్రారంభించారు  ఇవి షణ్ముఖచారి గారి వ్యాసంలో నుంచి  తీసుకున్నవి  వారికి కృతజ్ఞతలు.
-==========================
సమన్వయం ; డా. . నీలం స్వాతి 



కామెంట్‌లు