గ్రంథాలయాలే
దేవాలయాలు
విజ్ఞానకుసుమాలున్న
విరితోటలు
అనుభవజ్ఞుల
అనుభవసారం
గ్రంథనిధైనిలిచినది
అజ్ఞానంబాపిన
విజ్ఞానదీపం
/గ్రంథాలయాలే/
పామరులకు దారిదీపము
పావనమైన జీవనం
అక్షరమే అనంతశక్తై
బ్రతుకును వెలిగించును
/గ్రంథాలయాలే/
తలవంచి పుస్తకాలు
చదవాలి చదువరులు
తలయెత్తి బ్రతికేరు
భవితమార్చుకుందురు
/గ్రంథాలయాలే/
పుస్తకమే హస్తభూషణం
పుస్తకమేమస్తకభూషణం
పుస్తకమే వెలిగే కాగడా
పుస్తకమే భవితకు దిక్సూచి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి