ఏది స్వాతంత్ర్యం?
ఇదిఇదేనా స్వరాజ్యం?
బజారుతగదాలు మోసకారితనం
పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతుంటే
బల్ల క్రింద గీతముచేతికందుతుంటే
స్వాభిమానం అటకెక్కి సిద్దాంతం
రాద్ధాంతంగా మార్చి పొట్టపోసుకుంటున్నప్పుడు
ఏవైపునకు మన పయనం
ఏది స్వాతంత్ర్యం?
ఇదిఇదేనా స్వరాజ్యం?
కంచెయే చేనును మేస్తున్నప్పుడు
నకిలిమకిలి మనిషి
మనస్సంతా నిండినప్పుడు
అవసరానికి ఆత్మగౌరవాన్ని గాలికొదిలేసినపుడు
సామాన్యుని బ్రతుకులోన
స్తబ్దత నెలకొన్నప్పుడు-
ఏది స్వరాజ్యం?
ఇదిఇదేనా స్వాతంత్ర్యం?
ప్రజా ప్రతినిధులు
తాము ప్రజాసంక్షేమమంతా
తమసొంతమేనని
భావిస్తున్నప్పుడు
సమైక్యత ముసుగులో
ప్రాంతాలు దెబ్బలాడుకున్నప్పుడు
అల్పసంఖ్యాకుల రక్షణేది
మతం మంటలు రగులుతున్నప్పుడు
ఈ అనాచారాన్నేనా
మనంఇజమందామా?!
ఏది స్వాతంత్ర్యం?
ఇదిఇదేనా స్వరాజ్యం?
ఛాందసవాదం మనిషిని మరుగుజ్జునుచేసినప్పుడు
వ్యక్తిగత స్వార్థం అణువణువున నిండినపుడు
విశృంఖల స్వేచ్ఛయే
బానిసత్వాన మనలతోస్తున్నప్పుడు
ఏది స్వాతంత్ర్యం?
ఇదిఇదేనాస్వరాజ్యం?
నేడు నాటీ వందల మంది అమరులు మళ్ళీ పుట్టినా?!
ఎందరో యింకెందరో సామాజిక !వేత్తలు
నాటి కుట్రదారుల అసలు రంగు బయటపెట్టి అసువులు బాసినా!?
ఇక్కడి సామాన్యుడు మాత్రం
చైతన్యశీలికాలేడు
ఇక్కడి బుద్దిజీవులు
నిస్తేజంగా!?
ఎప్పుడొచ్చును స్వాతంత్ర్యం !
ఇంకెన్నడొస్తుంది స్వరాజ్యం!!
అధికారులే మాజీలై
పొలిటిషన్లై
ఉద్యమాస్ఫూర్తిని
నీరుగారుస్తుంటే
చదువుల్లో నాణ్యత కొరవడితే
చైతన్యంలేదు స్వరాజ్యంరాదు
మనం ఏమేమిలోటుపాట్లు
సమాజంలో గమనించామో?!
వాటికై ఉద్యమించిననాడు
నాడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు...
అదే ఈ దేశస్వాతంత్ర్యం
స్వాతంత్ర్య వీరుల ఆశయం
ఆనాడే 2
మన దేశానికి వచ్చును
నిజమైన స్వరాజ్యం
అప్పుడే2
అదే 2
మనదేశానికి అసలుసిసలైన
స్వాతంత్ర్య దినోత్సవం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి