అమ్మలోని
అ
నాన్నలోని
న
రెండు కలిసిన రూపమే
అన్న
తల్లిలాలాలించి
తండ్రిలా పాలించే
మన (మా)తోబుట్టువే అన్న
మనకన్న ముందు పుట్టిన
తనచేయిపట్టినడిపించి
చంకనెత్తుకొని ఆచందమామను చూపి
నోటికి గొరుముద్దలందించి
మమ్మల్ని ఎంతో మురిపెంగా చూసేది మాఅన్నే
మమ్ము బడికి వెంటతీసుకెళ్ళింది మా అన్నే
గొట్టుగ ఉన్న పాఠాలను తానో
స్నేహితుడై అర్థమయ్యేటట్టు
చెప్పింది మా అన్నే
నేను ఊళ్ళో ఉన్న కాడికి చదివి
ఇక నేను కాలేజీ చేస్తానంటే
అమ్మ పెళ్లి చేద్దామన్నప్పుడు
మా అమ్మానాన్ననొప్పించి
కాలేజీలో చేర్చింది మా అన్నే
నాన్న చూపనిలోకాన్నంతా
అన్న
తన కళ్ళతో మాకు చూపించిండు
నా పెళ్ళిచూపుల్లో చెల్లే అబ్బాయి
నచ్చాడా ?లేదా? అని
నన్నడిగాక
సరే అన్నాడు
మాఅన్న
పెళ్లయ్యాక అప్పగింతలప్పుడు
నన్ను ఆలింగనం చేసుకొని చెళ్ళేచెళ్ళే అని గట్టిగా చంటిపిల్లాడిలా ఏడ్చిండు మా అన్న
అన్నా నువ్వు పొమ్మంటే పోతా
లేకుంటే లేదు నువ్వు ఏడ్వొద్దన్నా
మా ఆయన చేతిలో నాచేయి పెట్టి కాళ్ళు మ్రొక్కి బోరున ఏడ్చిండు మా అన్న
ఇది అన్నంటే
నాకు మా అన్న పంచప్రాణాలు
నేను మా అన్నకు పంచప్రాణమే
ప్రతిరాఖీపండగకు మా అన్న
మాకెల్లప్పుడు రక్షగుండాలని
రాఖీకడుతాము
మా అన్న అనెటోడు నీదినాది
రక్తసంబంధం రా చెల్లే అని అనెటోడు నా బొందిలో ప్రాణమున్న వరకు నీ చేయివిడువననేటోడు
మా అన్న మా ఆయన మా ఊళ్ళో
నడిచి వెళ్తుంటే అన్నదమ్ముల
లెక్క ఉండెటోళ్ళుఅని అంటుండే
మా వాడకట్టంతా!
మా అన్న ఆశీర్వాదము ఉంటే
మా ప్రాణాలకు ఎటువంటి ఢోకా ఉండదు కదా!
చెల్లే నీకు నేను రక్ష
నాకు నువ్వు రక్ష
మన మిద్దరం లోకానికి రక్ష రక్ష
లోకంలోని అక్కాచెల్లెళ్ళు అందరికీ
రాఖీ పండుగ శుభాకాంక్షలు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి