సమసమాజమే మన ఏకైక లక్ష్యం;- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగాం-9640748497
మనుషులంతా ఒక్కటే 
మంచి మానవత్వం చూపుదాం(చాటుదాం) 
సాటి మనుషులతో సఖ్యత గా ఉందాం 

స్వార్థమే పరమావధిగా జీవించేవారికి 
ఈ సమాజంలో బ్రతికే యోగ్యతలేదుకదా!?

వర్షించని 
గొడ్డు మేఘం వల్ల
ప్రయోజనమేముంది?

తమ స్వార్థం కోసం బ్రతికేవాడి
వల్ల 
సమాజానికి లాభమేముంది?
ఉత్తమమైనది మానవజన్మేకదా!
దీనికిసార్థకతచేకూర్చుదాం

మనం బ్రతికేదెందుకు!?
తోటివారితో కలిసిమెలసి 
జీవించేందుకేకదా!

నిత్యం ప్రేమానురాగాలు ఆత్మీయతలు పంచుదాం

మరణమున్న మనమధ్య 
ధనం , కులం ,మతం ,రంగు ,రూపు భేదాలెందుకు?!
సమసమాజమే మన ఏకైక లక్ష్యం!?
సమతావాదమే మన మతం! 
మన అభిమతం!!


కామెంట్‌లు