దోపిడీ చేసినవాడు ఇంకా బ్రతికే ఉన్నాడు
మంచి మానవత్వంకలవాడు
కూటికి లేక ఆత్మాభిమానం అడ్డొచ్చియాచించలేక అర్థాంతరంగా
చచ్చిపోయాడు
ఇప్పుడు చెడిన సమాజానికి
దుర్మార్గుడే ప్రవచనకారుడయ్యాడు
అమాయకుడు, బ్రతకనేర్వనోడు జీవశ్చవమే
ఇప్పుడు డబ్బుదే పైచేయి
కులము గలుగు వాడు గోత్రంబుగలవాడు
విద్యచేత విర్రవీగువాడు
పసిడి గల్గువాని బానిస కొడుకులు
ఆత్మాభిమానం ఆత్మగౌరవం
చంపుకొని బ్రతుకుతున్న
బలహీనులు
వేయిగొడ్లను తిన్న రాబందును
ఎదుర్కోలేని సాధుజీవులు
మార్గదర్శకులు లేరిక్కడ
నమ్మించి నిలువుదోపిడీ
చేసేవారే అంతా
దగాపడ్డొడిక్కడ ఏ ఒక్కడూ
గొంతు చించుకొని అరవడే
బలిసినోడి కనుసన్నల్లో
జగమంతా నడుస్తొంది
ముందు బ్రతుకు లేనేలేదు
ఉందనుకుంటే అదో వెర్రితనమే
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి