పద్యసుమాలు(ఆటవెలది );- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగాం-9640748497

 1)పొగ నుతాగ వద్దు పొగ సూరి పోవద్దు
శ్వాస గొట్టం పూడి  శ్వాస ఆగు
చెబితెవినకయున్నచెడిపోగజూసేము
వినుము సోదరుండ వీరభద్ర
--------------------------------------
2)కత్తి లేదు గాని కత్తి సమము మాట
మనిషి మనసు విరుచు మాటలెన్నో
మేకు దించగలరు మెత్తని మాటతో
వినుము సోదరుండ వీరభద్ర-
------------------------------------------
3)ఆడితప్పనోడుఅంకాల మీ అన్న
మాయ తెల్వనోడు మంచివాడు
అన్నగారు నీకు ఆత్మ బంధువుగద
వినుము సోదరుండ వీరభద్ర
-----------------------------------------------
4)రోజు కథలు చెప్పి రోమియో వైతివి
కాలమంత చెల్లె కథల  వల్ల
చేయి కాలినాక చేతికి తడియంట
 వినుము సోదరుండ వీరభద్ర
-----------------------------------------------
5)అయ్య మత్తు నూగె అమ్మయువిలపించె
కాపురమ్ముఅయ్యెకడలితీరు
ఇంటి పెద్దచెడిన ఇక్కట్లుదీరునా!?
వినుము సోదరుండ వీరభద్ర
----------------------------------------------
6)కన్న తల్లి ఒకరె కడుపును ఒక్కటే
ఎదిగి నట్టి సంతు ఎదవ లైరి
 పాలు పట్టి తల్లి పాపమేచేసెనా!?
వినుము సోదరుండ వీరభద్ర

కామెంట్‌లు