నేను కవిని
ఉదయించే రవిని
ఒక్కొక్క సామాజిక అంశాన్ని
ఏరికోరి తెచ్చి
సామాజిక సాంస్కృతిక
చైతన్యానికై
నా కలాన్ని,నా గళాన్ని
ఆయుధంగా వాడుతూ సమసమాజం స్థాపనకై అహరహం కృషిచేస్తున్నాను
నా కవితల్లో బొగ్గుగని కార్మికులు
పంటపొలాల్లో
పనిచేసే శ్రామికులు
అసంఘటిత రంగం కార్మికులు
ఇలా
ఎందరెందరివో
కథలు వెతలు
ఎత్తిచూపుతుంటాను
నాదెప్పుడు ధిక్కార స్వరమే
నేను నా కవితకు
సామాజిక ఇతివృత్తాన్నే
నా కవితా వస్తువుగా స్వీకరిస్తాను
నేనెవడి పంచన బ్రతకను
నేనెవడికి బాకా ఊదను
నేను ప్రజాస్వామ్యబద్ధంగా
కవిత్వం వ్రాస్తాను
ప్రజాపక్షపాతినై
నేనుంటాను
కర్మగ్రహచారం అనే ఆత్మన్యూనత సూత్రాన్ని
వల్లె వేసే
చైతన్య హీనుల్నీ చర్నాకోలాతోనేను కొట్టిలేపుతాను
నిత్యచేతనత్వమే
మన ముందడుగని
ఉద్భోధిస్తాను
ఉదయించే రవిని
ఒక్కొక్క సామాజిక అంశాన్ని
ఏరికోరి తెచ్చి
సామాజిక సాంస్కృతిక
చైతన్యానికై
నా కలాన్ని,నా గళాన్ని
ఆయుధంగా వాడుతూ సమసమాజం స్థాపనకై అహరహం కృషిచేస్తున్నాను
నా కవితల్లో బొగ్గుగని కార్మికులు
పంటపొలాల్లో
పనిచేసే శ్రామికులు
అసంఘటిత రంగం కార్మికులు
ఇలా
ఎందరెందరివో
కథలు వెతలు
ఎత్తిచూపుతుంటాను
నాదెప్పుడు ధిక్కార స్వరమే
నేను నా కవితకు
సామాజిక ఇతివృత్తాన్నే
నా కవితా వస్తువుగా స్వీకరిస్తాను
నేనెవడి పంచన బ్రతకను
నేనెవడికి బాకా ఊదను
నేను ప్రజాస్వామ్యబద్ధంగా
కవిత్వం వ్రాస్తాను
ప్రజాపక్షపాతినై
నేనుంటాను
కర్మగ్రహచారం అనే ఆత్మన్యూనత సూత్రాన్ని
వల్లె వేసే
చైతన్య హీనుల్నీ చర్నాకోలాతోనేను కొట్టిలేపుతాను
నిత్యచేతనత్వమే
మన ముందడుగని
ఉద్భోధిస్తాను
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి