ప్రపంచానికి పని సంస్కృతి
నేర్పినోడు
బురద నుంచి బువ్వ తీసినోడు
దేశానికి వెన్నెముకైనోడు
తన స్వేదంతో దేశ సౌభాగ్యాన్ని పెంచినోడు
మనందరి కంచంలో అన్నంమెతుకైనోడు అన్నదాత అతడు
నేడు అన్నంకోసం అంగలారుస్తున్నాడు
పంటచేలే తన ప్రయోగశాలై
నిత్యం శోధించే సాధకుడు
అతివృష్టి అనావృష్టి వడగండ్లు కడగండ్లు కళ్ళారా చూసినోడు
నకిలి విత్తనాలు ,ఎరువులు, పురుగుమందులు
తనను నిండముంచగా పురుగుల ముందే పెరుగన్నమై
బలవన్మరణం నొందినోడు
వ్యవసాయ మార్కెట్లో రైతుకు సరియైన గిట్టుబాటు ధర లభించాలి
ఆధునిక కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతున్నను ఆదుకోవాలన్న సత్సంకల్పంతో
2లక్షలవరకు బ్యాంకు రుణాలను రెండు దఫాలుగా మాఫీ చేయాలని నిర్ణయించడం
క్రాప్ హాలిడే ఇద్దామనుకున్నరైతుసోదరులకు ఎంతో ఊరటనిచ్చే అంశం
ఎద్దు ఏడ్చిన వ్యవసాయం
రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు
వ్యవసాయ క్షేత్రాల్లోనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలి.
ఆరుతడి పంటలల్నిప్రోత్సహించాలి
ఎప్పటికప్పుడు రైతులకు
వ్యవసాయనిపుణులచే
ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించాలి
ఇలా ఎప్పటికప్పుడు వ్యవసాయానికి సాయమందిస్తే
వ్యవసాయరంగం బ్రతికి బట్ట కడుతుంది .
లేకుంటే?
వ్యవయే వ్యవసాయమైతే
అన్నదాతలు దినసరి కూలీలు కాకతప్పదు
లోకం అన్నమో రామచంద్రా అనే రోజులురాకతప్పదు
వ్యవసాయానికి సాయమందిద్దాం
వ్యవసాయం దండగకాదు
పండగని నిరూపిద్దాం
రైతన్నను ఆదుకుందాం
జై కిసాన్!
జై కిసాన్ :;- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగాం-9640748497
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి