వివిధ ;- అంకాల సోమయ్య--ద=రుప్పులజనగాం-9640748497
దయలేకుంటే
మనిషినెలా గుర్తిస్తావు
దయాగుణమే
మనిషికి మూలవేరు

విద్యార్థులు
నిరంతర సాధకులు
అధ్యాపకులు
జ్ఞానప్రదాతలు

ఆధునిక మహిళ
అబలకాదు సబల
అణచివేత పై
యుద్దం ప్రకటించింది

చేతికి కొడవళ్ళు
మొలిచాయి
చేష్టలుడిగినవాళ్ళు
చరిత్ర సృష్టించనున్నారు

స్వీట్ హైదరాబాద్
షడ్రుచులలో తీపిని 
తీసేద్దాం
అదే రేపు మనకు మరణశాసనం

బాధ
పడొద్దనలేదు
బాధల బంగాళాఖాతంలో
మునగొద్దంటున్నా

రాయిని
ఈసడించకండి
తొక్కితే అది మెట్టు
మ్రొక్కితే 
అది దైవం

బ్రతుకంటే
కాలక్షేపంకాదు
కాలం వినియోగం
గెలుపుకు ఆహ్వానం 



కామెంట్‌లు