తొలి చూపులోనే తొలకరై నన్ను
తడిపినది నీ ప్రేమ
నీ చూపులో ఏదో మత్తుమందుంది
నా మనస్సెప్పుడో
నీ వశమైనది
అందమైన నీ ముఖారవిందం
అంతే అందమైన నీ మాటతీరు
నన్ను కట్టిపడేస్తున్నాయి
ప్రేమంటే తెలియని నాకు
నిన్ను చూసిన మరుక్షణం
ప్రేమ ఎంత మధురం అనే భావన కల్గినది
కసాయివాడనైన నన్ను
కరుణామయుణ్ణి చేసావు
ప్రేమకు శక్తి యుక్తి ఉంది
ప్రియా నువ్వు ఊ అంటే
ఇరువురు కుటుంబ సభ్యుల మధ్య మన పెళ్ళి నిశ్చయమే
నువ్వు కాదంటే శివుడినికై
తపస్సు చేసిన పార్వతీ దేవినై
నిన్ను సాధించుకుంటా!?
ఈ విరహం నేను తాళలేను
నీ ఈ మధురాతి మధురమైన
ప్రేమ గాఢతను నేను తట్టుకోలేను
నువ్వు నా దానివి అయ్యావంటే
నేను ఈ లోకాన్ని జయించినట్టే
ఆ(ఈ ) పంచభూతాలమీద ఒట్టు
నీ చేయి విడవను నా మీ దొట్టు
మన ప్రేమ వాడని వన్నెతగ్గని స్వర్ణపుష్పం
మన ప్రేమ సలీం అనార్కలి
పారుదేవదాలా విఫల ప్రేమ కాదు
ఆ రాధా కృష్ణుల ఆరాధన మనప్రేమ
నువ్వే నేనుగా నేనే నువ్వుగా
దేహాలు రెండైనా ప్రాణమొకటై
బ్రతుకుదాం
కలనైనా ఇలనైన ఎడబాటు,
మనమధ్య ఎటువంటి అరమరికలు ఉండనే ఉండవులే
ఏడేడు జన్మలకు నువ్వే నా రాణివి
నీ రాజును నేనే
ఆ ఇంద్రధనుస్సులోని అందమంతా
మన జీవితంలో పులుముకుందాం
హక్కులు బాధ్యతలు ఇరువురు సమంగా పంచుకుందాం
ప్రియా !?
ఈ ప్రేమ ఎంత మధురమోకదా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి