పల్లవి:
దేశం ఏమిచ్చెనని ప్రశ్నవేయకు
దేశసేవ చేయుటకు వెనుకడుగువేయకు
చరణం 1
ఛరఖానే చక్రంగా తిప్పిన బాపూ
శాంతిని ఒకఛత్రంగా ఎత్తిన చాచా
ఏ ఆశయసాధనలో అసువులను బాసారు
ఏ ఆదర్శం అంచున స్వేచ్ఛకు తెరతీశారు
చరణం 2
అతివాదులు మితవాదులు త్యాగధనులు బలిదానం
మనం అనుభవించు స్వాతంత్య్రం
ఆస్ఫూర్తిని చాటాలి
దేశ ఐక్యతను చూపాలి
వ్యక్తిలోన దేశముంది గుర్తిస్తేచాలురా
ఆలోచన జెండాగ ఎగరేస్తేమేలురా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి