ఎందుకో నేను
విశాలత్వాన్ని మరిచి
స్వార్థపరత్వపు రొంపిలోకి
దిగుబడి పోతున్నాను
ఎందుకో నేను
సత్యాన్ని విడిచి
అసత్యాన్ని పులుముకొని
రంగులు మార్చే ఊసరవెల్లి
లా మారాను
ఎందుకో నేను
స్నేహ హస్తాన్ని విడిచి
కరుడుగట్టిన కసాయోడితోని
సఖ్యతగుంటున్నాను
ఎందుకో నేను
కలికాలపు అవలక్షణాలను
అందిపుచ్చుకొని
నాకు నేనే నచ్చక
నేను ఇప్పుడు ఎందుకో
మధన పడుతున్నాను
నేను మనిషినా!
నేను మనిషినే నా?!
అని నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నాను
ఇప్పుడు నేను మారుతున్నాను
నేను మహాత్ముడిని కాకపోయినా
సాధారణ పౌరుడిలాగ
జీవించాలనుకుంటున్నాను
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి