మాతృ భాషనుబ్రతికించుకుందాం;- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
తెలుగు భాషీయులకు
ఆంగ్లభాషా వ్యాయోహం
బాగా పెరిగిపోయింది
తెలుగు మాట్లాడితే
అవమానమా?!
ఆంగ్లంమాట్లాడితే
అగ్రతాంబూలమా ?!
ఇదేం దౌర్భాగ్యంమో
ఇదేం చాదస్తమో
విద్య వ్యాపారుల
కపటనాటకమేఇది?!

ప్రాథమిక విద్య కూడా
అంతర్జాతీయ భాష లో
చదివితే ఉపాధి ఉద్యోగావకాశాలు
పుష్కలంగా
లభిస్తాయని
ఊకదంపుడు ఉపన్యాసాలు
ఇచ్చి తల్లి భాషకు
గోరికట్టి
అంతర్జాతీయ స్థాయిలో
తమ విద్యా సంస్థలు నెలకొల్పి
తమ విద్యా వర్తకాన్ని
ప్రపంచ మంతా విస్తరించుకున్నారు
పేదవాడికి నామమాత్రపు
తెలుగు మీడియం
బడులు నడిపి
విద్యానైపుణ్యం లేని
అజ్ఞానులు గా మార్చారు2

ప్రాథమిక విద్యే
రేపటి భవితను
దిశానిర్దేశం చేసేది
ఆవిద్య నేడు ఎందుకు
కొరగానిదై 
ఇంగిత జ్ఞానం లేని
చదువరులుగా
మిగులు తున్నారు

ఇకనైనా భాషాభిమానులు
తెలుగు మాట్లాడేవారు
మేలుకొని మన అమ్మ
భాషలోనే చదువుకుందాం2
మన అమ్మ భాష చదివితే
ఉపాధి ఉద్యోగావకాశాలు
లభించేలా ప్రభుత్వంపై
ఒత్తిడి తెద్దాం 2
అప్పుడే మన భాషా దీపం
మలగకుండా వెలుగుతుంది
అమ్మ ను ప్రేమించువారు
అమ్మ భాషను ప్రేమిస్తారు2
మాతృ భాష కళ్ళవంటిది
పరాయి భాష కళ్ళజోడు
వంటిది 2; (కరుణానిధి )
మాతృ భాష తల్లి పాలవంటిది
పరాయి భాష పోత పాలవంటిది  2; (కొమర్రాజు వెంకట లక్ష్మణరావు)

కామెంట్‌లు