ప్రవాహ హితుడుడా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871;-
బాధల క్లేశ తీరాలే కాదు అనుభవించిన 
సంతోషాల ఖుషీ పర్వాలూ ప్రవహిస్తున్న 
స్నిగ్ధ సిందూర మకరంద సంద్రాల యవనికే అవని

ఓడుతున్న వెచ్చని రక్తం పచ్చని స్పర్శ 
ఆత్మీయ విశ్వాసం నిండిన కలల కలతల లోకం 
ఎన్నటికీ ఎప్పటికీ ఎండిపోని చెలిమె చెలిమి దారెంట

అవరోధాల వెక్టర్స్ అగాధాల హాకర్స్ నుండి ఇమ్యూనైన స్నేహం 
నిత్య నిర్మల క్లోరోఫిల్ గానం
భరోసా బంధాల నేత్రపర్వం మిత్రత్వం

స్నేహించని ప్రాణి లేదు ప్రకృతిలో
బతికిస్తూ జీవించడమే గొప్ప జీవకళ 
పొలిమేరలు లేని సత్యం సుందరమైన 
అనంత అద్భుత నిత్య  ప్రవాహం అమలిన స్నేహ సుగంధం 

ఎండుటాకుల ఆకుపచ్చ పిడికిళ్ళు వాడు
నారు అలికిన మడి దున్నిన నాగళ్ళు అతడు
పూసిన అత్తరు పూల పరిచితుడు 
కావ్యమై నడిచే చేతిపుస్తకధారి స్నేహితుడు 


కామెంట్‌లు
K.Ravindra chary చెప్పారు…
Very nice explaination and honour for true friendship which is nothing but pure form of love and the language with beautiful gems is the high light to reveal poetic emotion. Congrats to thr poet