దూరం;- డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871
మరీ ఎంతో కాదు సుమా 
దూరం అలాగని దగ్గర కూడా 
కాదు
కొలువలేనంత దీర్ఘం కాదు మరి పొట్టి రూపం కానేకాదు

దీని వేగం మాత్రం ముక్కుమీది కోపం కన్నా ఎక్కువే మరి 
చిక్కంతా గమ్యం లేని అర్థంకాని సంచారం
శృతిలేని సంసార సాగరంలో అన్యాపదేశ ఆగమన సంకీర్తన శ్రవణ ఫలం కాబోలు

మనమనుకుంటాం గానీ ఇది ఎవరూ కలుపలేనిది కాదనీ  చేతుల ప్రేమ అల్లుకున్న తీగ తీరు 

నన్నూ ఆటపట్టించిన సందర్భాలెన్నో బాల్యచేష్టల పరాకాష్ట 
అప్పుడు నాకు బాల్యం కేరింత అడుగులేసే నా మనుమరాలు ఆటపాటల మైదానంలో చిరు విరామమైనా
చిరునవ్వు పూలతోట దులుపుతుంది లేలేత విసురులో 
తాతా! నాతోనే ఆడాలి పాడాలి అటూఇటూ పోవద్దు ఓ చిన్న ఫర్మానా వదిలింది
చిన్న విరామ చిహ్నమూ 
మధ్యన దూరిన దూరం భావనే వాక్యంలో

మనసంతా 
నిరంతర రక్తప్రసరణ లయ అమేయ విప్పారుతున్న బోసినవ్వుల గెలాక్సీ

కనిపించని చిన్న చుక్కంత దూరం
కూడా భరించలేనిది కలల బాల్యం
ఏంతో విలువైనది కదా బతుకులో 


కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Diction is so poetic and the emotional flow contained in it is so natural and genuine. Hats off to the poet.