జయహో భారత్ *;- మిత్రాజీ (ప్రభాకర్ రావు గుండవరం,)ఫోన్ నం.9949267638
స్వాగతం సుస్వాగతం 
స్వాతంత్ర్యలక్ష్మీకి స్వాగతం 
స్వాగతం సుస్వాగతం 

తెల్లవారిని తరిమికొట్టిన 
స్వాతంత్ర్య యోధులకు వందనం
దేశం కోసం పోరాడిన 
మహా వీరులకు వందనం 
త్యాగధనులకు, మహాత్ములకు 
సకల యోధులకు వందనం 
భరతమాత స్వేచ్చ కోసం ప్రాణాలొడ్డిన 
అమర వీరులకు వందనం 
దేశమాతకు వందనం భరతమాతకు వందనం 
మూడు రంగుల ముచ్చటైనా 
మువ్వన్నెల జెండాకు వందనం అభి వందనం 🙏


కామెంట్‌లు