భారత దేశం; - సాకి, 9949394688.
విశాల విలువలనే విశ్వానికి ఇచ్చినదీ దేశం 
మాతృభూమిగా మన్ననకెక్కినదీ భారతదేశం

సత్యధర్మముల సాధనగా మనుగడ నేర్పేను
శాంతిసహనముల సారథిగా సాగెను ఈ దేశం

పుష్కలమైన పుణ్యనదులతో పంటలనిచ్చేను
ఖనిజసంపదలరత్నగర్భగా వెలిగెను ఈ దేశం

సకల కళలకు ఆలవాలమై సంస్కృతినిచ్చేను
నాగరికతనే ప్రపంచానికి అందించిన దీ దేశం


కామెంట్‌లు